పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం ఇంటి నుంచి బయటకు రాబోతున్నారని, 23 లేదా 24లో షూట్ ప్రారంభం అవుతుందని వార్తలు వినిపించాయి.
Advertisement
అయితే షెడ్యూలు మళ్లీ మారినట్లు బోగట్టా. వాతావరణం పరిస్థితులు బాగా లేకపోవడంతో డేట్ లు మారినట్లు తెలుస్తోంది.
నవంబర్ 1 నుంచి 10 వరకు అలాగే డిసెంబర్ 1 నుంచి 10 వరకు ఇరవై రోజులను పవన్ తన వకీల్ సాబ్ ను ఫినిష్ చేయడానికి కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ గ్యాప్ లో పవన్ తో సంబంధం లేని సీన్లు చేసుకుంటారు. సంక్రాంతి వేళకు సినిమాను రెడీ చేసి పెట్టాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు.