ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో పుష్ప సినిమా చేయడం కోసం దర్శకుడు సుకుమార్ టీమ్ చాలా కష్టపడిందట. పోలీస్ అధికారులను, పారెస్ట్ అధికారులను ఇలా చాలా మందిని కలిసి విషయం సేకరించారట. అది పేజీలకు పేజీలు వుందట. దాంట్లో వన్ పర్సంట్ మాత్రం పుష్ప సినిమాకు వాడారట. మిగిలిన సరుకు అంతా అలాగే వుంది.
పుష్ప సినిమా పార్ట్ 2 అయిపోయిన తరువాత వెబ్ సిరీస్ గా ఈ మెటీరియల్ అంతా వాడాలని డిసైడ్ అయ్యారట సుకుమార్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పుష్ప 2 తరువాత వెబ్ సిరీస్ ను ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో చేస్తానని థాంక్స్ మీట్ లో వెల్లడించారు.
పార్ట్ 2 ను తీస్తామని పుష్ప యూనిట్ అంతా ఘంటా పథంగా చెబుతోంది. రెండు నెలల్లో పుష్ప సెట్ మీద కలుద్దాం అని హీరోయిన్ రష్మిక చెప్పగా, ఈసారి పుష్ప సినిమాను వీలయినన్ని ఎక్కువ ప్రపంచ భాషల్లో విడుదల చేస్తామని సుకుమార్ చెప్పారు. అలాగే పార్ట్ 2 లో సునీల్ విశ్వరూపం చూస్తారని నిర్మాతలు వెల్లడించారు.
దీన్ని బట్టి చూస్తుంటే అందరూ కలిసి పుష్ప పార్ట్ 2 చేయడానికే డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది.