రిస్క్ చేసాం..ఫలితం పొందాం

అఖండ సినిమా విషయంలో తాను ఇలాంటి అలాంటి రిస్క్ చేయలేదని నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి అన్నారు. ఇంత భారీ సినిమాను ఇంత రిస్క్ తో విడుదల చేయడం మామూలు విషయం కాదన్నారు. విడుదల…

అఖండ సినిమా విషయంలో తాను ఇలాంటి అలాంటి రిస్క్ చేయలేదని నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి అన్నారు. ఇంత భారీ సినిమాను ఇంత రిస్క్ తో విడుదల చేయడం మామూలు విషయం కాదన్నారు. విడుదల నాటికి థియేటర్ల పరిస్థితులు బాగా లేవు. కరోనా మూడో దశ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో 20 కోట్ల మేరకు రిస్క్ చేసి సినిమాను విడుదల చేసామన్నారు.

ప్రేక్షకుల ఆదరణతో విజ‌యం సాధించామని ఆయన అన్నారు ఇప్పటికీ 16 కోట్ల మేరకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి రావాల్సి వుందని, కానీ ఇక అది సమస్య కాదని ఆయన అన్నారు. అఖండ సినిమాను, ఆ కాంబినేషన్ ను తాను మొదటి నుంచీ నమ్మానని, అందుకే ధైర్యం చేసానని అన్నారు. స్క్రిప్ట్ ను బోయపాటి తనకు చెప్పినపుడు బడ్ఙెట్ గురించే తాను ప్రస్తావనించానని, ఆయన వీలయినంత ఙాగ్రత్తగా చెేద్దామన్నారని వెల్లడించారు.

బోయపాటి-బాలకృష్ణ గారి కాంబినేషన్ క్రేజ్ ను తాను ముందుగానే అంచనా వేసానని, అందుకే బడ్ఙెట్ చెప్పినపుడే తాను ఇంతకు మార్కెట్ చేయగలను అని అంచనా వేసానన్నారు. అదే విధంగా ముందుకు వెళ్లామన్నారు. షూటింగ్ లో బాలయ్య పక్కన కూర్చున్నపుడు ఓ సాదా సీదా మనిషిలా అనిపిస్తారని, తీరా టేక్ స్టార్ట్ చేస్తే ఆయన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారని, చూడడానికి రెండు కళ్లూ చాలవని ఆయన అన్నారు.

త్వరలో ఓ చిన్న, ఓ మీడియం, ఓ భారీ సినిమాలు వరుసగా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నామని, భారీ సినిమా వివరాలు ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. బోయపాటి తరువాత సినిమాలో కూడా తన భాగస్వామ్యం వుండే అవకాశం వుందని, అయితే అది తాను చెబితే బాగోదని, అటు వైపు నుంచే ఆ వార్త బయటకు వస్తే బాగుంటుందని అన్నారు.

ఓ మంచి సినిమా తీసానన్న ఆనందం వుందని, ఇకపై సినిమా రంగంలో ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నా అని మిరియాల రవీందర్ రెడ్డి అన్నారు.