ప‌బ్లిక్‌లో ఫొటోలు పెట్టి ప‌ర్స‌న‌ల్ అంటే ఎలా జ్వాలా?

త‌మిళ హీరో విష్ణువిశాల్‌తో వ్య‌వ‌హారంపై ‘అది నా పర్సనల్‌. వివాదం చేయొద్దు’ అని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల గురువారం వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే విశాల్‌తో స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్‌లో…

త‌మిళ హీరో విష్ణువిశాల్‌తో వ్య‌వ‌హారంపై ‘అది నా పర్సనల్‌. వివాదం చేయొద్దు’ అని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల గురువారం వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే విశాల్‌తో స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్‌లో పోస్ట్ చేయ‌డం, అవి వైర‌ల్ కావ‌డం తెలిసిందే. బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణిగా ఆమె ఓ సెలిబ్రిటీ. ఆమెకు సంబంధించిన ఏ విష‌య‌మైనా స‌మాజంలోని ఓ వ‌ర్గం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంటుంది.

విశాల్‌తో బంధం పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని, వివాదం చేయ‌వ‌ద్ద‌ని చెబుతున్న గుత్తా జ్వాల‌కు, ప‌ర్స‌న‌ల్ ఫొటోలు ఎవ‌రి కంటా ప‌డ‌కుండా దాచుకోవాల‌ని తెలియ‌దా? సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం వెనుక ఆమె ఉద్దేశం ఏంటి?  వారిద్ద‌రి సాన్నిహిత్యం గురించి ఎవ‌రికి చెప్పాల‌ని, ఎవ‌రికి తెలియాల‌ని పెట్టింద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

గుత్తా జ్వాల ఓ ఛీప్ ప‌బ్లిసిటీకి పాల్ప‌డ్డార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. గ‌తంలో ఆమెకు సాటి క్రీడాకారుడితో ప్రేమ వివాహం జ‌ర‌గ‌డం, కొంత కాలానికి విడాకుల‌కు దారి తీయడం తెలిసిందే. ఆ త‌ర్వాత ఓ ప్ర‌ముఖ క్రికెట‌ర్‌తో స‌న్నిహ‌తంగా మెలుగుతోంద‌నే ప్ర‌చారం కూడా విస్తృతంగా సాగింది. ఆ త‌ర్వాత ఆమె అలాంటిదేమీ లేద‌ని కొట్టిపారేశారు.

ఇప్పుడు విశాల్‌తో స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను త‌నే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం, ఆ విష‌య‌మై మీడియా ప్ర‌శ్న‌ల‌కు పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మ‌ని చెప్ప‌డం, త‌మ మ‌ధ్య  ప్రేమ వ్య‌వ‌హారాన్ని ఖండించ‌క‌పోవ‌డం…అనేక ఊహ‌ల‌కు ఆమె మరింత‌గా తావిచ్చిన‌ట్టైంది.

అల్లు అర్జున్ దోశ స్టెప్పు