‘సమన్యాయం’ నా నినాదం: సీఎం వైఎస్‌ జగన్‌

''కేవలం ఒక్క ప్రాంతానికే అభివృద్ధిని పరిమితం చేయాలనుకోవడంలేదు.. రాష్ట్రమంతటా అభివృద్ధి జరగాలి.. ప్రాంతీయ విధ్వేషాలకు అవకాశం లేని అభివృద్ధి చేస్తున్నాం.. ఈ క్రమంలో మీ అందరి సహకారం, ఆశీస్సులు నాకు కావాలి.. మీ బిడ్డగా…

''కేవలం ఒక్క ప్రాంతానికే అభివృద్ధిని పరిమితం చేయాలనుకోవడంలేదు.. రాష్ట్రమంతటా అభివృద్ధి జరగాలి.. ప్రాంతీయ విధ్వేషాలకు అవకాశం లేని అభివృద్ధి చేస్తున్నాం.. ఈ క్రమంలో మీ అందరి సహకారం, ఆశీస్సులు నాకు కావాలి.. మీ బిడ్డగా అడుగుతున్నాను.. మీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించేందుకు నా వంతు కృషి చేస్తాను..'' అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి.

రాష్ట్రానికి మూడు రాజధానులు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి వంటి అంశాలపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రానున్న రోజుల్లో సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్న విషయం విదితమే. కాగా, వైఎస్‌ జగన్‌, పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి నూతన కార్డుల్ని అందిచే కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ వేదికపైనుంచే రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై వైఎస్‌ జగన్‌ తన ఆలోచనల్ని పరోక్షంగా ప్రజల ముందుంచారు.. ప్రజల సహకారాన్ని కోరారు.

రాజధాని అమరావతి విషయంలో రాయలసీమ ప్రాంత ప్రజలు అన్యమనస్కంగానే ఒప్పుకోవాల్సి వచ్చిందన్నది నిర్వివాదాంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయిన దరిమిలా, మరో మారు అలాంటి పరిస్థితి రాకూడదనే అమరావతి విషయంలో రాయలసీమ ప్రజలు ఆచి తూచి వ్యవహరించారు. అయితే, రాజధాని పేరుతో ఐదేళ్ళూ చంద్రబాబు సర్కార్‌ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేసింది. 

మరోపక్క, అమరావతి ఓ సామాజిక వర్గం కోసమేనన్న ఆవేదన రాష్ట్ర ప్రజల్లో పెరిగిపోయిన మాట వాస్తవం. అందుకు చంద్రబాబు పాలనే కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు వచ్చేందుకు ఆస్కారం లేకుండా చేయాలన్న సంకల్పంతోనే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌, సంచలన నిర్ణయం తీసుకుంది.

అదే మూడు రాజధానుల కాన్సెప్ట్‌. పరిపాలన ఎక్కడుంటే అదే రాజధాని అయినప్పటికీ, రాజధాని అనే గుర్తింపు అటు రాయలసీమకీ దక్కేలా కర్నూలుని జ్యుడీషియల్‌ రాజధానిగా ప్రతిపాదిస్తోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌.

అయితే, ఏం చేసినా.. అది ప్రజల ఆశీస్సులతోనే సాధ్యమవుతుందన్న వైఎస్‌ జగన్‌ మాటలు అక్షర సత్యం. 'ఇది నాది.. నేను చేస్తున్నాను..' అనే అహంకారంతో కాకుండా, 'మీ ఆశీర్వాదంతో చేయగలుగుతున్నాను..' అంటూ జగన్‌, ఓ బహిరంగ సభ నుంచి.. అందునా, ప్రభుత్వ కార్యక్రమం తాలూకు వేదిక పైనుంచి పిలుపునివ్వడం గొప్ప విషయమే కదా.!