ఏజెంట్ మీద ఇంకా అనుమానమేనా?

ఏప్రిల్ 28 విడుదల..అఖిల్ అక్కినేని ఏజెంట్. ఇది లేటెస్ట్ అఫీషియల్ డేట్. కానీ ఇప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమా అనుకున్న ప్రకారం ఆ డేట్ కు వస్తుందా? అని అనుమానపడుతూనే వున్నారు. ఫ్యాన్స్…

ఏప్రిల్ 28 విడుదల..అఖిల్ అక్కినేని ఏజెంట్. ఇది లేటెస్ట్ అఫీషియల్ డేట్. కానీ ఇప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమా అనుకున్న ప్రకారం ఆ డేట్ కు వస్తుందా? అని అనుమానపడుతూనే వున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు బిజినెస్ సర్కిళ్లలో కూడా ఇదే అనుమానం. అందుకే హొల్ సేల్ గా సినిమాను అమ్మేసినా, రిటైల్ అమ్మకాలు మాత్రం ఇంకా షురూ కాలేదు. 

ఎప్పటి నుంచి చెక్కుతున్నారో ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి. నలభై కోట్ల బడ్జెట్ అన్నది ఎనభై కోట్లు అవుతోంది. నిర్మాత అనిల్ సుంకర ఫ్రస్టేషన్స్ పీక్స్ లో వుందని ఇన్ సైడ్ టాక్.

దర్ళకుడు సురేందర్ రెడ్డిని ఫేస్ చేస్తే, తన కోపం ఏ రేంజ్ లోకి వెళ్తుందో అని నిర్మాత అనిల్ సుంకరే స్వయంగా అనుకుని, దూరంగా వున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ఫైట్ అంటూ మస్కట్ వెళ్లి వచ్చారు. ఇంకా ఒకటో, రెండో పాటల చిత్రీకరణ వుంది. హీరో ఏమో, సిసిఎల్ క్రికెట్ లీగ్ అంటూ తిరుగుతున్నారు. ఇంతకీ పాటలు పూర్తయ్యాయో లేదో తెలియదు.

ఇప్పటికి ఒక్క పాట వదిలారు. దానికి పెద్దగా బజ్ రాలేదు. తరువాత మళ్లీ ఇప్పటి వరకు మరో కంటెంట్ లేదు. విడుదల మరో నెలరోజుల్లో వుంది. కాంపిటీషన్ కూడా వుంది. అయినా కంటెంట్ విడుదల ప్లానింగ్ కనిపించడం లేదు. దాంతో అసలు సినిమా పక్కాగా వస్తుందా? వాయిదా పడుతుందా అన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.