వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అసురన్ రీమేక్ (తెలుగులో అసురుడు వర్కింగ్ టైటిల్) రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా వెంకీ సరసన శ్రియను తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు చిన్న మార్పు జరిగింది. ఈ సినిమాలో శ్రియ నటించడం లేదు. ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు.
కేవలం బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. రెమ్యూనరేషన్ పరంగా శ్రియ అందుబాటులోనే ఉంది. కాకపోతే ఆమె ప్రయాణ ఖర్చులు భరించడం మాత్రం కాస్త కష్టమే. ఎందుకంటే, ప్రస్తుతం బార్సిలోనాలో మకాం పెట్టిన ఈ బ్యూటీ, అక్కడ్నుంచి ముంబయికి వస్తుంది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి ముంబయి లేదా బార్సిలోనా వెళ్లిపోతుంది.
అసలే అసురన్ రీమేక్ కోసం చాలా తక్కువ బడ్జెట్ అనుకున్నారు. ఇలాంటి టైమ్ లో శ్రియ కోసం ఇంత ఖర్చుపెట్టడం అనవసరం అని భావించాడు నిర్మాత సురేష్ బాబు. పైగా శ్రీకాంత్ అడ్డాల మేకింగ్ స్టయిల్ ఎలా ఉంటుందంటే,, అతడికి నటీనటులంతా అందుబాటులో ఉండాలి. ఏ రోజు ఏ సీన్ తీస్తాడో అతడికే తెలియదు. అందుకే నిత్యం అందుబాటులో ఉండే ప్రియమణిని సెలక్ట్ చేశారు.
ఈ సినిమా కోసం ఆల్రెడీ ప్రియమణి కాల్షీట్లు కూడా కేటాయించింది. ఈనెల 22 నుంచి 4 రోజుల పాటు ప్రియమణి-వెంకటేష్ పై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ సినిమా కోసం పూర్తిగా కొత్త నటీనటుల్ని తీసుకున్నారు. ఈ మేరకు కాస్టింగ్ కాల్ నిర్వహించి అందర్నీ సెలక్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లకు వర్క్ షాప్ జరుగుతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
నీకు ఏం కావాలన్నా చేస్తానని జగన్ చెప్పారు.. చిరంజీవి