నటుడిగా నానికి మంచి అప్లాజ్ తెచ్చిపెట్టిన సినిమా శ్యామ్ సింగ రాయ్. సినిమా ఫస్ట్ వీక్ ఓకె అనిపించేసుకుంది. కానీ సమస్య ఒక్కటే ఆంధ్ర, సీడెడ్ ల్లో టికెట్ రేట్లు లేకపోవడం. ఫుట్ పాల్ బాగానే వుంది. కానీ లెక్క కనిపించడం లేదు.
మల్టీ ఫ్లెక్స్ లు ఎక్కువగా వున్న విశాఖ ఏరియా బాగుంది. తొలి వీకెండ్ కోటిన్నరకు పైగా వసూలు చేసింది. టోటల్ రన్ లో మూడుకోట్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే 12 కోట్ల రేషియో.
ఈస్ట్ లో కూడా బాగానే వుంది. తొలివీకెండ్ 50 లక్షలకుపైగా చేసింది. అక్కడ కొన్న రేటు కోటి రూపాయలు కాబట్టి ధైర్యంగానే వున్నారు. కానీ థియేటర్లు బాగా సీజ్ అయిన దక్షిణ కోస్తాలో మాత్రం ఫిగర్లు అంతగా కనిపించడం లేదు. చూడాలి. అయితే సినిమా విడుదల నాడే డిస్ట్రిబ్యూషన్ కింద మార్చేసారు కనుక బయ్యర్లకు సమస్య లేదు.
నైజాంలో ఆరు కోట్లకు దగ్గరగా చేసింది కాబట్టి అక్కడ సమస్య లేదు. ఓవర్ సీస్ లో హాఫ్ మిలియన్ దగ్గర చేసింది. మరో హాఫ్ మిలియన్ చేయాల్సి వుంది కానీ ఆ ఫీట్ సాధ్యం అవుతుందో లేదో చూడాలి.