అది అనారోగ్యం కాదు.. మేకోవర్ అంట!

కొన్నాళ్ల కిందట రానాకు ఆరోగ్య సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఏకంగా అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నాడు. సర్జరీ నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈమధ్య 2-3 పబ్లిక్ ఫంక్షన్లలో కూడా కనిపించాడు.…

కొన్నాళ్ల కిందట రానాకు ఆరోగ్య సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఏకంగా అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నాడు. సర్జరీ నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈమధ్య 2-3 పబ్లిక్ ఫంక్షన్లలో కూడా కనిపించాడు. తాజాగా మత్తువదలరా ప్రమోషన్ కోసం మరోసారి మీడియా ముందుకొచ్చాడు రానా. అలా రానాను చూసిన చాలామంది అవాక్కయ్యారు. మరీ బక్కపల్చగా తయారైనా రానా, ఇంకా కోలుకోలేదంటూ గుసగుసలాడుకున్నారు.

మేటర్ పెద్దదై, పుకారుగా మారకముందే క్లారిటీ ఇస్తే బెటర్ అనుకున్నారామో, కాస్త ముందుగానే మేల్కొంది కాంపౌండ్. రానా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. అంతేకాదు, మేకోవర్ లో భాగంగానే రానా అలా పీలగా కనిపిస్తున్నాడని చెబుతున్నారు.

విరాటపర్వం సినిమాలో నక్సలైట్ గా నటిస్తున్నాడు రానా. నక్సలైట్ పాత్ర అంటే సహజంగానే లుక్ పరంగా సన్నగా తయారవ్వాలి.. అడవుల్లో ఉండే వ్యక్తులు కాబట్టి సన్నగానే ఉండాలి. ఎలాంటి కండలు కనిపించకూడదు. అందుకే రానా ఇలా స్లిమ్ లుక్ లోకి మారాడని చెబుతున్నారు అతడి సన్నిహితులు.
 
వాళ్లు కవరింగ్ కోసం చెబుతున్నారా, నిజమే చెబుతున్నారా అనే విషయాన్ని పక్కనపెడితే.. విరాటపర్వం సినిమాలో రవన్న అనే నక్సలైట్ పాత్రకు మాత్రం సరిగ్గా సరిపోయే ఫిజిక్ తోనే రానా కనిపిస్తున్నాడు. బహుశా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కాస్త కండపడతాడేమో.

నీకు ఏం కావాలన్నా చేస్తానని జగన్ చెప్పారు.. చిరంజీవి