10న రమ్మనండి చూద్దాం

బన్నీ-త్రివిక్రమ్ సినిమా డేట్ మార్పిడి అంతా పబ్లిసిటీ స్టంట్ అని, వాళ్ల పబ్లిసిటీ స్టంట్ ను నమ్మి, వార్తలు ఇస్తూ గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ డిస్ట్రిబ్యూటర్లను కన్ ఫ్యూజ్ చేస్తోందని నెల్లూరు జిల్లాకు…

బన్నీ-త్రివిక్రమ్ సినిమా డేట్ మార్పిడి అంతా పబ్లిసిటీ స్టంట్ అని, వాళ్ల పబ్లిసిటీ స్టంట్ ను నమ్మి, వార్తలు ఇస్తూ గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ డిస్ట్రిబ్యూటర్లను కన్ ఫ్యూజ్ చేస్తోందని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఆరోపించారు.

ఆయన 'గ్రేట్ ఆంధ్ర' తో ఫోన్ లో మాట్లాడుతూ, అల వైకుంఠపురములో సినిమా 12నే విడుదలవుతుందని అన్నారు. ఇదంతా సినిమాకు ప్రచారం కోసం బన్నీ యూనిట్ ఆడుతున్న పబ్లిసిటీ స్టంట్ అని ఆయన అన్నారు.

తమకు బన్నీ యూనిట్ నుంచి, హారిక యూనిట్ నుంచి, అది కూడా కీలక బాధ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారమే అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నామని, ఇందులో కన్ ఫ్యూజ్ చేసే వ్యవహారం ఏదీ లేదని 'గ్రేట్ ఆంధ్ర' వివరించగా, ఒకసారి సినిమా అమ్మేసిన తరువాత డేట్ మార్చాలంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా సహకరించాల్సి వుంటుందని, మొండిగా 10కే వెళ్తాం అంటే ఓన్ రిలీజ్ చేసుకోవాల్సిన సమస్య వస్తుందని ఆ డిస్ట్రిబ్యూటర్ హింట్ ఇవ్వడం విశేషం.

గతంలో ఇద్దరు అమ్మాయిలతో సినిమా టైమ్ లో బన్నీ యూనిట్ ఇలాగే ప్రయత్నించిందని, ఆఖరికి వారం రోజులు వెనక్కు వెళ్లిపోయిందని ఆ డిస్ట్రిబ్యూటర్ గుర్తు చేసారు. అందువల్ల తమ అంచనా ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అల వైకుంఠపురములో సినిమా 12నే వస్తుందని ఆ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. 

ఇదే వైనాన్ని హారిక హాసిని బాధ్యుల దగ్గర ప్రస్తావించగా, తాము ఇద్దరు హీరోల సినిమాల మధ్క్ష సయోధ్య కుదిర్చే పనిలో వున్నామని, ఇలాంటి టైమ్ లో ఇలాంటి కామెంట్లు వ్యవహారాన్ని చెడగోడతాయని అనడం విశేషం.

చిరు vs రాజశేఖర్