Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'రాజుగారి' స్వంత సినిమా

'రాజుగారి' స్వంత సినిమా

ఎమ్ఎస్ రాజు. ఈ పేరు ఒకప్పుడు అందరికీ పరిచయం. ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టిన  బ్యానర్ కు అధినేత. మహేష్ తో ఒక్కడు, ప్రభాస్ తో పౌర్ణమి లాంటి సినిమాలు తీసిన నిర్మాత. అలాంటి నిర్మాత ఇప్పుడు ఎవరికీ గుర్తులేరు.

సక్సెస్ వెనుక పరిగెట్టే ఇండస్ట్రీ. గతం గుర్తు పెట్టుకునేది కాదు. అందుకే ఎమ్ఎస్ రాజు పేరు బాగా పాతదైపోయింది. ఆయన తన కొడుకును హీరో చేయాలని ప్రయత్నించారు. అది సక్సెస్ అయినా బాగుండేది. అదీ కాలేదు. అందుకే రాజుగారి పేరు మరిచిపోయారు చాలా మంది సినిమా జనాలు.

ఇలాంటి నేపథ్యంలో ఎమ్ఎస్ రాజు పేరు మరోసారి వినిపిస్తోంది. నిర్మాతగా కాదు, దర్శకుడిగా. ఈ రాజుగారికి డైరక్షన్ మీద మోజు వుంది. గతంలో వాన అనే సినిమా ట్రయ్ చేసారు. ఇప్పుడు మళ్లీ మరో సినిమా చేస్తున్నారు. ఓ డిఫరెంట్ జోనర్ సినిమాను ఆయన అందిస్తున్నారు. ఇది హర్రర్ టచ్ తో వుండే థ్రిల్లర్ జోనర్ సినిమా అని తెలుస్తోంది.

తక్కువ బడ్జెట్ లో పూర్తిగా వైవిధ్యమైన కథతో తయారైన ఈ సినిమాను జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ఎమ్ ఎస్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

టైటానిక్ సినిమా గుర్తుకు చేసారు::చిరు అండ్ మోహన్ బాబు 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?