రోడ్డుపైనే ముద్దులు.. న్యూ ఇయ‌ర్ స్పెష‌ల్!

బెంగ‌ళూరు మ‌హా న‌గ‌రంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు మ‌రోసారి శ్రుతి మించాయి. మూడేళ్ల కింద‌ట న్యూ ఇయ‌ర్ వేడుక‌లు అక్క‌డ పూర్తిగా అదుపు త‌ప్పాయి. కీల‌క‌మైన ప్రాంతాల్లో, బార్లు, ప‌బ్బులు ఉండే ప్రాంతాల్లో యువ‌తుల…

బెంగ‌ళూరు మ‌హా న‌గ‌రంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు మ‌రోసారి శ్రుతి మించాయి. మూడేళ్ల కింద‌ట న్యూ ఇయ‌ర్ వేడుక‌లు అక్క‌డ పూర్తిగా అదుపు త‌ప్పాయి. కీల‌క‌మైన ప్రాంతాల్లో, బార్లు, ప‌బ్బులు ఉండే ప్రాంతాల్లో యువ‌తుల మీద కొంత‌మంది పోకిరీలు వెకిలిగా వ్య‌వ‌హ‌రించారు. అలాంటి అప‌శ్రుతులు ఆ యేడాది బెంగ‌ళూరు న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను వార్త‌ల్లో నిలిపాయి. అయితే ఆ త‌ర్వాత కూడా ప‌రిస్థితి పెద్ద‌గా మారిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు.

ఈ సారి కూడా బెంగ‌ళూరులో న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో అనుచిత‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఎంజీ రోడ్డుతో స‌హా .. బార్ల‌కు, ప‌బ్బుల‌కు కొలువైన ప‌లు ప్రాంతాల్లో యువ‌తీయువ‌కులు రోడ్డెక్కి న్యూ ఇయ‌ర్ సంబ‌రాల‌ను చేసుకున్నారు. మ‌ద్యం మత్తు తీవ్ర‌మైన స్థాయికి చేర‌డంతో వారిలో కొంద‌రు అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

య‌థావిధిగా ఆక‌తాయి చేష్ట‌లు కొన‌సాగాయి. మ‌ద్యం మ‌త్తులోని యువ‌కులు కొంద‌రు.. అదే స్థితిలో ఉన్న అమ్మాయిల‌తో రోడ్ల మీద అభ్యంత‌ర‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన దాఖ‌లాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వారిని తాక‌డం.. కౌగిలించుకునే ప్ర‌య‌త్నాలు, అస‌భ్య క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఇలాంటి వ‌న్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి ప‌లు చోట్ల‌. కొన్ని చోట్ల అలాంటి ఆక‌తాయిల ప‌ట్ల అమ్మాయిలు కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యి చెప్పులతో కొట్టిన వైనాలూ రికార్డు అయ్యాయి.

అలాంటి ఆక‌తాయి చేష్ట‌లు ఒక ఎత్తు అయితే, మ‌రి కొంద‌రు మ‌ద్యం మ‌త్తులో  రోడ్ల మీదే రొమాన్స్ తో రెచ్చిపోవ‌డం గ‌మ‌నార్హం. బ‌హిరంగ కౌగిలింత‌లు, ముద్దులు న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో కామ‌న్ అయ్యాయి. ఇక కొన్ని చోట్ల అయితే కొంద‌రు అర్ధ‌న‌గ్నంగా మారిపోయిన వైనాలు వార్త‌ల్లో నిలుస్తున్నాయి. అలాంటి వారిని పోలీసులే వారించి పంపించి వేశారు.