రవితేజ హీరోగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న భారీ బయోపిక్ ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్ట్ పురం గజదొంగ బయోపిక్ ఇది. ఈ సినిమాను వచ్చే నెల 20 న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కాస్త భారీగానే బిజినెస్ జరిగింది. నాన్ థియేటర్ కింద, ఇంకా శాటిలైట్ కాకుండానే 49 కోట్లు వచ్చింది. థియేటర్ బిజినెస్ ను కూడా ఆల్ మోస్ట్ క్లోజ్ చేసారు. ఓవర్ సీస్, కర్ణాటక మినహా మిగిలిన ఏరియాలు అన్నీ క్లోజ్ చేసారు.
ఆంధ్ర ను హోల్ సేల్ గా 17 కోట్లకు ఉషా పిక్చర్స్ కు ఇచ్చేసారు. సీడెడ్ ను 5.40 కోట్లకు ఇచ్చారు. నైజాం మాత్రం 9 కోట్ల అడ్వాన్స్ మీద డిస్ట్రిబ్యూషన్ కు ఆసియన్ సినిమాస్ కు ఇచ్చారు. మొత్తం మీద చూసుకుంటే దాదాపు 80 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. సినిమాకు కాస్త భారీగానే ఖర్చయింది. హీరో రెమ్యూనిరేషన్ కాకుండా 50 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తం మీద మంచి టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లే అనుకోవాలి టైగర్ నాగేశ్వరరావుకు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సిజి పనులు మాత్రం పెండింగ్ వున్నాయి. దసరా సీజన్ లో అటు లియో, ఇటు భగవత్ కేసరి సినిమాలతో పోటీ పడుతూ టైగర్ నాగేశ్వరరావు విడుదల కాబోతోంది.