ర‌మ్య‌తో వివాదం న‌డుస్తుండ‌గానే…!

సీనియ‌ర్ నటీన‌టులు న‌రేష్‌, ప‌విత్ర ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకున్నారు. స‌న్నిహితుల మ‌ధ్య వాళ్లిద్ద‌రూ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా పెళ్లికి సంబంధించి వీడియోను న‌రేష్ త‌న ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.…

సీనియ‌ర్ నటీన‌టులు న‌రేష్‌, ప‌విత్ర ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకున్నారు. స‌న్నిహితుల మ‌ధ్య వాళ్లిద్ద‌రూ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా పెళ్లికి సంబంధించి వీడియోను న‌రేష్ త‌న ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.

ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు అంటూ ఆయ‌న త‌మ‌కు పెళ్ల‌యిన విష‌యాన్ని వెల్ల‌డించారు. మీ ఆశీస్సులు కావాల‌ని ఆ జంట విన్న‌వించింది.

ఇదిలా వుండ‌గా న‌రేష్‌, ఆయ‌న భార్య  ర‌మ్య మ‌ధ్య వివాదం ఇంకా న‌డుస్తుండ‌గానే, తాజాగా మ‌రో పెళ్లి చేసుకోవ‌డం విశేషం. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ న‌రేష్‌కు విడాకులు ఇవ్వ‌న‌ని, ప‌విత్ర‌తో పెళ్లి జ‌ర‌గ‌నివ్వ‌న‌ని ఆ మ‌ధ్య ర‌మ్య శ‌ప‌థం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల త‌న ఇంటిపై దుండ‌గులు దాడి చేశార‌ని, ఈ ఘ‌ట‌న వెనుక ర‌మ్య ఉన్న‌ట్టు న‌రేష్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ర‌మ్య‌తో విడాకుల సంగ‌తి తేల‌కుండానే ప‌విత్ర‌ను పెళ్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

గ‌తంలో న‌రేష్‌, ప‌విత్ర బెంగ‌ళూరులో ఓ హోట‌ల్ గ‌దిలో వుండ‌గా ర‌మ్య వెళ్లి గొడ‌వ చేసిన సంగ‌తి తెలిసిందే. కావాల‌నే త‌మ‌ను ర‌మ్య ఇబ్బంది పెడుతోంద‌ని, డ‌బ్బు కోసమే వేధిస్తోంద‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గ‌తంలో ప‌విత్ర‌, తాను పెళ్లి చేసుకోబోతున్నామంటూ ట్విట‌ర్ వేదిక‌గా న‌రేష్ వెల్ల‌డించారు. ఇప్పుడు ఎలాంటి ప్ర‌చారం లేకుండానే పెళ్లి జ‌ర‌గ‌డం విశేషం. ప‌విత్ర‌కు గ‌తంలో పెళ్ల‌య్యింది. వైవాహిక జీవితంలో విభేదాలు త‌లెత్త‌డం, ఆ త‌ర్వాత విడాకులు దారి తీసింది. ఇప్పుడు న‌రేష్‌తో ప‌విత్ర కొత్త జీవితాన్ని పంచుకుంటున్నారు. 

న‌రేష్ జీవితంలో ఒక‌రికి  మించి మ‌హిళ‌లు వ‌చ్చారు, వెళ్లారు. ఇప్పుడు ప‌విత్ర కొత్త‌గా వ‌చ్చారు. న‌రేష్ పెళ్లిపై ర‌మ్య ఎలా స్పందిస్తారో చూడాలి.