రాజకీయ నటనే లాభమా పవనూ…!

పవన్ కళ్యాణ్ సినిమా నటుడు, వెండి తెరపై ఆయన నటన ధియేటర్లలో విజిల్స్ వేయిస్తుంది. కానీ పవన్ రెండేళ్ళుగా నటించడం మానుకున్నారు. మరి పవన్ రాజకీయాల్లో చేస్తున్నదేంటి అంటే అది కూడా అచ్చమైన నటనేనని…

పవన్ కళ్యాణ్ సినిమా నటుడు, వెండి తెరపై ఆయన నటన ధియేటర్లలో విజిల్స్ వేయిస్తుంది. కానీ పవన్ రెండేళ్ళుగా నటించడం మానుకున్నారు. మరి పవన్ రాజకీయాల్లో చేస్తున్నదేంటి అంటే అది కూడా అచ్చమైన నటనేనని అంటున్నారు వైసీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్.

పవన్ కి రాజకీయ నటన బాగా లాభసాటిగా ఉందని సెటైర్లు  వేస్తున్నారు. కొన్ని సార్లు ప్రీ పెయిడ్, మరి కొన్ని సార్లు పోస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా పవన్ రాజకీయ తెరవైన విశ్వరూపం చూపిస్తున్నారని కూడా గుడివాడ గట్టిగానే తగులుకున్నారు.

అమరావతి రాజధాని మార్చేస్తామని జగన్ ఎక్కడా చెప్పలేదని, మరి పవన్ మాత్రం రాజధాని వెళ్ళిపోతోందని గుండెలు బాదుకోవడం ఏంటని అమర్నాధ్ నిలదీస్తున్నారు.

ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ అయిదేళ్ళలో ఏనాడూ చంద్రబాబుకు పల్లెత్తు మాట అనలేదని, ఆయన రాజధానుల విషయంలో గుంటూరు, నూజివీడు పేర్లు చెప్పి జనాలను మభ్యపెడితే కనీసం మాట్లాడలేదని కూడా గుడివాడ అంటున్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివుధ్ధి చేస్తామని జగన్ అంటూంటే అమరావతి ఒక్కటే ఏపీలో  ఉన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆయనకు తోడుగా పవన్ సైతం రాజధాని తరలిపోతోందని రైతులను రెచ్చగొడుతున్నారని గుడివాడ విమర్శించారు.

రైతుల విషయంలో పూర్తి న్యాయం జగన్ చేస్తారని, ఆయనకు ఆ చిత్తశుధ్ధి ఉందని కూడా గట్టిగా చెప్పిన గుడివాడ, ఏపీలో అన్ని  ప్రాంతాలు బాగుపడడం బాబుకు, పవన్ కు అసలు ఇష్టం లేనట్లుగా ఉందని కడిగేశారు.

మొత్తానికి పవన్ రాజకీయం కూడా సినిమాల మాదిరిగానే చేస్తున్నారని గుడివాడ విసుర్లు విసరడం, ప్రీ పోస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ బిరుదులు తగిలించడం కొత్త ఏడాది ఆరంభంలో జనసేనానికి గట్టి కౌంటర్లే  మరి.

ప్రజల అందరికి నూతన సంవత్సర శుభకాంక్షలు ::జగన్