తెలుగోళ్ల‌ను మెప్పించ‌లేక‌పోయా.. మురుగ‌ నిజాయితీ!

తాము తీసే సినిమాలు తెలుగునాట స‌రిగా ఆడ‌క‌పోయిన‌ప్పుడు కొంద‌రు త‌మిళ మూవీ మేక‌ర్లు అతి మాట‌లు మాట్లాడారు. త‌మ సినిమాలు ఇక్క‌డ తిర‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌డం గురించి స్పందిస్తూ.. తెలుగు వాళ్ల‌కు సినిమాలు చూడ‌టం…

తాము తీసే సినిమాలు తెలుగునాట స‌రిగా ఆడ‌క‌పోయిన‌ప్పుడు కొంద‌రు త‌మిళ మూవీ మేక‌ర్లు అతి మాట‌లు మాట్లాడారు. త‌మ సినిమాలు ఇక్క‌డ తిర‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌డం గురించి స్పందిస్తూ.. తెలుగు వాళ్ల‌కు సినిమాలు చూడ‌టం రాదు.. అంటూ పేలిన వాళ్లు కూడా ఉన్నారు. త‌మ చేత‌గాని తనాన్ని అలా కొంద‌రు స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు. స‌రైన సినిమాలు తీయ‌లేక ప్రేక్ష‌కుల మీద అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వారున్నారు.

అయితే ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ మాత్రం అలా మాట్లాడ‌లేదు. ఇటీవ‌లే ర‌జ‌నీకాంత్ చేత కూడా ప్ర‌శంసంలు అందుకున్న ద‌ర్శ‌కుడు మురుగ‌. శంక‌ర్ త‌ర్వాత మురుగ‌దాసే ధీటైన ద‌ర్శ‌కుడు అంటూ ఇటీవ‌లే ర‌జనీకాంత్ అనౌన్స్ చేశాడు. అలాంటి మాట‌ల కిక్కు కూడా మురుగ‌కు ఎక్కిన‌ట్టుగా లేదు. నిజాయితీగా చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.. త‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయిన‌ట్టుగా!

స్టాలిన్, స్పైడ‌ర్.. ఈ రెండు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను డైరెక్టుగా ప‌ల‌క‌రించాడు మురుగ‌. అయితే ఈ రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద ఆక‌ట్టుకోలేక‌పోయాయి. చిరంజీవి స్టార్ డ‌మ్ పీక్స్ మీద ఉన్న‌ప్పుడు స్టాలిన్ వ‌చ్చింది. ఇక స్పైడ‌ర్ ఏ స్థాయి అంచ‌నాల‌తో వ‌చ్చిందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఎందుకో ఆ సినిమాలు ఆడ‌లేదు. అలాగ‌ని త‌మిళ‌నాట మురుగ స్టార్ డ‌మ్ కు తిరుగు లేదు. ఇత‌డు త‌మిళంలో తీయ‌గా.. తెలుగులోకి వ‌చ్చిన ప‌లు సినిమాలు కూడా ఇక్క‌డ పోయాయి. 

రీమేక్ గా వ‌చ్చిన ఠాగూర్, డ‌బ్బింగ్ గా వ‌చ్చిన గ‌జినిలు మాత్ర‌మే ఆడాయి. మిగ‌తావ‌న్నీ ఆక‌ట్టుకోలేక‌పోయిన‌ట్టే. తమిళులకు బాగా న‌చ్చిన త‌న సినిమాలు తెలుగులో ఆడ‌లేద‌ని, అలాగే డైరెక్టుగా తెలుగులో తీసిన సినిమాలూ ఆడ‌లేద‌ని.. బ‌హుశా తెలుగులో త‌ను హిట్ కొట్టాలంటే మ‌రింత‌గా డీప్ గా స్ట‌డీ చేయాలేమో అని మురుగ‌దాస్ వ్యాఖ్యానించాడు.

ప్రజల అందరికి నూతన సంవత్సర శుభకాంక్షలు ::జగన్