వైకాపా ప్ర‌భుత్వం కూలిపోవ‌చ్చు: ప‌వ‌న్ క‌ల్యాణ్

మ‌రి సీరియ‌స్ గా మాట్లాడుతుంటారో, కామెడీ అవుతుంద‌ని తెలిసినా మాట్లాడ‌తారో కానీ.. జ‌న‌సేన అధిప‌తి త‌న నోటిని ఏ మాత్రం త‌గ్గించుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వ మ‌నుగ‌డ మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి వ్యాఖ్యానించారు. 151…

మ‌రి సీరియ‌స్ గా మాట్లాడుతుంటారో, కామెడీ అవుతుంద‌ని తెలిసినా మాట్లాడ‌తారో కానీ.. జ‌న‌సేన అధిప‌తి త‌న నోటిని ఏ మాత్రం త‌గ్గించుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వ మ‌నుగ‌డ మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ప‌డిపోవ‌చ్చు.. అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తిలో ప్ర‌క‌టించారు. అదెలా ప‌డిపోతుందో, ఎందుకు ప‌డిపోతుందో మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్ప‌లేదు. ప‌డిపోవ‌చ్చు.. అంటూ మ‌రోసారి ఇది వ‌ర‌కూ త‌ను మాట్లాడిన‌ట్టుగానే మాట్లాడారు జ‌న‌సేన అధిప‌తి.

ఇది వ‌ర‌కూ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ త‌ర‌హాలో.. ప్ర‌భుత్వ మ‌నుగ‌డ మీద వ్యాఖ్యానించారు. ఇప్పుడు మ‌రోసారి అదే ప్ర‌క‌ట‌నే చేశారు. త‌న మాట‌ల్లో లాజిక్ ఏమిటో ప‌వ‌న్ చెప్ప‌లేదు. బ‌హుశా ఆయ‌న‌కు కూడా తెలియ‌దు కాబోలు. ఇక అమ‌రావ‌తి ప్రాంతాన్ని ఎడారి అంటూ అవ‌మానించ‌కూడ‌ద‌ని ప‌వ‌న్ హితవు ప‌లికారు. మ‌రి అమ‌రావ‌తిని ఒక్క మాట అన్నందుకు ప‌వ‌న్ కు ఇంత బాధ అయితే.. ఇది వ‌ర‌కూ రాజ‌ధాని త‌మ ప్రాంతానికి కావాల‌న్న ప్రాంతాల‌ను ఏమ‌న్నారో ఈయ‌న‌కు తెలుసా?

శ్రీబాగ్ ఒప్పందం ప్ర‌కారం రాజ‌ధాని త‌మ ప్రాంతంలో ఉండాల‌న్న రాయ‌ల‌సీమ‌ను  ఏమ‌న్నారు? ఎడారి అన‌లేదా? రాయ‌ల‌సీమ రౌడీయిజం అన‌లేదా? అంత పెద్ద శ్రీశైలం ప్రాజెక్టుకు ఆశ్ర‌యం ఇచ్చే రాయ‌ల‌సీమ‌లో తాగ‌డానికి నీళ్లు లేవ‌ని అన‌లేదా? అలా రాయ‌ల‌సీమ విష‌యంలో నోటికొచ్చిన‌ట్టుగా  అధికార పార్టీ వాళ్లు పేలితే ప‌వ‌న్ క‌ల్యాణ్ నొప్పించ‌లేదు.  ప‌వ‌న్ కూడా రాయ‌ల‌సీమ ను అవ‌మానించేలా మాట్లాడిన వ్య‌క్తే, అమ‌రావ‌తిని మాత్రం ఒక్క మాట అన‌కూడ‌ద‌ని ప‌వ‌న్ చెబుతున్నారు.

ప్రజల అందరికి నూతన సంవత్సర శుభకాంక్షలు ::జగన్