నాడు ఏక‌ప‌క్షంగా రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌…ఎలాగంటే?

నాడు రాజ‌ధాని ప్ర‌క‌ట‌న ఏక‌ప‌క్షంగా జ‌రిగింది. దీనికి ఉదాహ‌ర‌ణ ఆరోజు అసెంబ్లీలో చోటు చేసుకున్న ప‌రిణామాలే. మూడుసార్లు స‌భ వాయిదా ప‌డ‌డమే నిద‌ర్శ‌నం. అధికారంలో తామే శాశ్వ‌తంగా ఉంటామ‌నే అహంకారం, లెక్క‌లేనిత‌నంతో టీడీపీ వ్య‌వ‌హ‌రించ‌డం…

నాడు రాజ‌ధాని ప్ర‌క‌ట‌న ఏక‌ప‌క్షంగా జ‌రిగింది. దీనికి ఉదాహ‌ర‌ణ ఆరోజు అసెంబ్లీలో చోటు చేసుకున్న ప‌రిణామాలే. మూడుసార్లు స‌భ వాయిదా ప‌డ‌డమే నిద‌ర్శ‌నం. అధికారంలో తామే శాశ్వ‌తంగా ఉంటామ‌నే అహంకారం, లెక్క‌లేనిత‌నంతో టీడీపీ వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే….నేడు మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌కు దారి తీసిందంటే అతిశ‌యోక్తి కాదు. నాడు అధికార టీడీపీ ఎంత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించిందో తెలుసుకుంటే క‌డుపు మండ‌క‌మాన‌దు.

అమ‌రావ‌తిని స్వాగ‌తిస్తున్నాన‌ని జ‌గ‌న్ చెప్పాడంటున్న వారు ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలి. అసెంబ్లీలో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ, బీజేపీ మాత్ర‌మే ఉన్నాయి. బీజేపీ-టీడీపీ మిత్ర‌ప‌క్ష పార్టీలు. ఇక మిగిలింది వైసీపీ మాత్ర‌మే. 2014లో అసెంబ్లీలో రాజ‌ధాని ప్ర‌క‌ట‌న సంద‌ర్భంలో చంద్ర‌బాబు విజ‌య‌వాడ ప్ర‌క‌ట‌న‌కు జై కొట్టారని వాదిస్తున్న వారు…ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు ర‌గ‌డ జ‌రిగిందో చెప్పాల్సిన బాధ్య‌త ఉంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అభిప్రాయంతో ఏ మాత్రం ప‌నిలేకుండా సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో రాజ‌ధాని పెట్టాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. అందువ‌ల్లే ఆయ‌న నేరుగా రాజ‌ధానిగా విజ‌య‌వాడ పేరు ప్ర‌క‌టించిన త‌ర్వాత చ‌ర్చ స్టార్ట్ చేయాల‌ని స్పీక‌ర్‌ను కోరాడు. ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌ట్టాడు. జ‌గ‌న్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై చంద్రబాబు ఈరోజు ప్రకటన చేస్తారని చెబుతున్నారని, ఇది సంప్రదాయం కాదని, తొలుత చర్చ జరిపి.. సభలో 175 మంది ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని, ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాడు. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చ సమంజసం కాదన్నాడు.

‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953లో తొలుత అసెంబ్లీలో చర్చ జరిగింది. అప్పట్లో ఐదు రోజులపాటు రాజధానిపై చర్చించారు. ఆ తర్వాతే రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించాలి’’ అని జగన్ చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదిక‌గా డిమాండ్ చేశాడు. 

సభలో డెమోక్రసీ లేదని జగన్‌ తప్పుబడితే.. అసెంబ్లీలో డెమోక్రసీ ఉందని, జగనోక్రసీ లేదని యనమల ఎద్దేవా చేశాడు. ప్రతిపక్ష సభ్యులు రాజధానిపై చర్చ చేపట్టాల్సిందేనని పట్టుపట్టారు. ఈ క్రమంలో సభను మూడుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

అవకాశముంటే ఇడుపులపాయ అనేవారుః  బాబు

రాజధాని అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిని ఇడుపులపాయకో లేదా వేరే చోటకో తీసుకెళదామని కొందరనుకున్నారని, అది కుదరలేదని వ్యాఖ్యానించాడు. దీనికి జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇడుపులపాయ, పులివెందుల అని తానడగలేదన్నాడు. అబద్ధాలు చెప్పి వాటినే గోబెల్స్‌గా ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటని విమర్శించాడు.