ఫస్ట్ టైమ్ శ్రీవిష్ణుపై ట్రోలింగ్

చూడ్డానికి అమాయకంగా ఉంటాడు, అతడి మాటలు, ప్రవర్తన కూడా సింపుల్ గా ఉంటుంది. ఇక సినిమాల్లో అతడు పోషించే పాత్రలు కూడా అలానే ఉంటాయి. అందుకే శ్రీవిష్ణు అంటే ఆడియన్స్ లో ఓ సాఫ్ట్…

చూడ్డానికి అమాయకంగా ఉంటాడు, అతడి మాటలు, ప్రవర్తన కూడా సింపుల్ గా ఉంటుంది. ఇక సినిమాల్లో అతడు పోషించే పాత్రలు కూడా అలానే ఉంటాయి. అందుకే శ్రీవిష్ణు అంటే ఆడియన్స్ లో ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. అలాంటి నటుడు ఇప్పుడు నెటిజన్లకు టార్గెట్ అయ్యాడు. దీనికి ఓ కారణం ఉంది.

శ్రీవిష్ణు తాజా చిత్రం అర్జున ఫాల్గుణ. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఇందులో గ్రామ వాలంటీర్ ప్రస్తావన ఉంది. హీరోయిన్ ను ఇంతకీ ఏ ఉద్యోగం అని అడుగుతాడు సైడ్ ఆర్టిస్ట్. దానికి హీరోయిన్ గర్వంగా గ్రామ వాలంటీర్ అని చెబుతుంది.

ఆ మాట వినగానే శ్రీవిష్ణు అదో రకంగా ముఖం పెడతాడు. “ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులిస్తారు అదేనా” అంటూ వెటకారంగా అడుగుతాడు. సరిగ్గా ఇక్కడే శ్రీవిష్ణు అడ్డంగా దొరికిపోయాడు. గ్రామ వాలంటీర్ అంటే అంత చిన్నచూపు ఎందుకంటూ నెటిజన్లు, మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు శ్రీవిష్ణును ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న కరోనా టైమ్ లో గ్రామ/వార్డు వాలంటీర్ చేసిన సేవల్ని శ్రీవిష్ణుకు గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. కొంతమంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ను షేర్ చేస్తుంటే, మరికొందరు పేపర్ కటింగ్స్ ను పోస్ట్ చేస్తూ, శ్రీవిష్ణుకు ట్యాగ్ చేస్తున్నారు.

దీంతో శ్రీవిష్ణు ఇరకాటంలో పడినట్టయింది. మరో 6 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకున్నారు. ఇప్పుడీ వివాదం మెల్లమెల్లగా ఊపందుకుంటోంది. అసలే రాష్ట్రంలో థియేట్రికల్ సిస్టమ్ సరిగా లేదు. ఇలాంటి టైమ్ లో జగన్ మానసపుత్రికైన వాలంటీర్ వ్యవస్థను ఈ సినిమాలో కెలిసి వదిలిపెట్టారు.

అయితే దీనిపై యూనిట్ ను సంప్రదించింది గ్రేట్ ఆంధ్ర. ట్రయిలర్ లో ఆ విజువల్ కాస్త వివాదాస్పదంగా అనిపించినప్పటికీ.. సినిమాలో గ్రామ వాలంటీర్ ఎపిసోడ్ అంతా పాజిటివ్ గానే ఉంటుందని, దాన్ని మంచి ఉద్యోగంగానే చెప్పామని అంటోంది యూనిట్.