కరోనా మూడో దశ ప్రభావం ముసురుకుంటోంది. నార్త్ లోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ అంక్షలు మళ్లీ విధిస్తున్నారు. బాలీవుడ్ సినిమాలకు కీలకమైన మహరాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధించారు. థియేటర్లలో యాభైశాతం ఆక్యుపెన్సీ విధించారు.
తమిళనాడు, కర్ణాటక ఫాలో ఫాలో అంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాల విడుదల వుంటుదా? వుండదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా వుంటే సంక్రాంతి బరిలోకి డిజె టుల్లు సినిమా దిగుతోంది. సంక్రాంతికి భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయాలనుకుని, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ల కోసం త్యాగం చేసిన సితార సంస్థ నిర్మించిన సినిమానే ఇది. డిజె టుల్లులో సిద్దు జొన్నలగడ్డ హీరో. యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ ఇది. పక్కా కుర్రకారు ఆడియన్స్ కోసమే నిర్మించిన సినిమా.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఇప్పుడు అర్ఙెంట్ గా డిసైడ్ చేయడం చూస్తుంటే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల విడుదల మీద అనుమానాలు బలపడుతున్నాయి. ఇక మరో పక్కా లోకల్ సినిమా బంగార్రాజు కూడా సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే.