కరోనా మరో ప్రముఖుడిని ఆసుపత్రి పాల్జేసింది. కరోనా నుంచి కోలుకున్నా.. ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యమం విషమంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే ఆయన కరోనా బారిన పడ్డారు. వారం కిందటే ఆయనకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో నిమోనియాకు గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా చికిత్సను అందిస్తున్నట్టుగా సమాచారం.
కరోనా భయాల నేపథ్యంలో చాలా రోజుల పాటు నాయిని ఇంటికే పరిమితం అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఆయన ఒక రోజు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ నేతగా పరామర్శలు, ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైనట్టుగా సమాచారం.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని, ఆ సమయంలో అభిమానులతో కాసేపు గడిపారట. బహుశా దాని వల్లనే ఆయన కరోనా కు గురి అయి ఉండవచ్చట. నాయిని నర్సింహారెడ్డి భార్య, అల్లుడు, మనవడు కూడా కరోనాకు గురి అయినట్టుగా సమాచారం. వారికి కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని, నాయిని భార్య ఆసుపత్రిలోనే ఉన్నారని తెలుస్తోంది.