Advertisement

Advertisement


Home > Movies - Movie News

సినిమాను త‌ల‌పించే లాస్య ర‌హ‌స్య పెళ్లి

సినిమాను త‌ల‌పించే లాస్య ర‌హ‌స్య పెళ్లి

బుల్లితెర యాంక‌ర్ , బిగ్‌బాస్ ఫేం లాస్య చూడ ముచ్చ‌ట‌గొలిపే అంద‌గ‌త్తె. గుండ్ర‌టి ముఖం, అన్నిటికి మించి ఆమె న‌వ్వు , ప‌ద్ధ‌తైన మాట‌తీరు బిగ్‌బాస్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. బుల్లితెర యాంక‌ర్‌గా ప‌రిచ‌య‌మైన లాస్య బిగ్‌బాస్ సీజ‌న్‌-4లో చోటు ద‌క్కించుకున్నారు. ఆరో వారం వ‌చ్చేస‌రికి ముఖ్య‌మైన టీవీ9 దేవి, సుజాత త‌దిత‌రులు ఇంటిదారి ప‌ట్టారు. కానీ లాస్య మాత్రం త‌న ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ చూర‌గొంటున్న‌ది.

ఇదిలా ఉండ‌గా, గురువారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన ముఖ్య‌మైన ఘ‌ట్టాల‌ను ఆవిష్క‌రిం చారు. ఈ సంద‌ర్భంగా లాస్య జీవితంలో అతి ముఖ్య‌మైన పెళ్లి ఘ‌ట్టం సినిమాను త‌ల‌పించేలా ఆస‌క్తిక‌రంగా ఉంది. తాను రైతు కూతురిన‌ని లాస్య చెప్పుకొచ్చారు. అమ్మ ద‌గ్గ‌ర నుంచి స‌హ‌నం, ఓర్పు నేర్చుకున్నాన‌ని తెలిపారు. తాను పుట్టిన ప్ర‌దేశాన్ని ఫొటోలో చూపి త‌న మాతృస్థ‌లంపై ప్రేమ క‌న‌బరిచారు.

అలాగే త‌న తండ్రి బైక్‌పై వెళుతుండ‌గా ప్ర‌మాదానికి గురి కావ‌డం, ల‌క్ష‌న్న‌ర‌కు పైగా వైద్య ఖ‌ర్చు అవుతుంద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డం , అంత ఆర్థిక స్తోమ‌త లేక‌పోవ‌డం గురించి లాస్య ఆవిష్క‌రించిన తీరు ప్ర‌తి ఒక్క‌రికీ క‌న్నీటిని తెప్పించింది. 

నాన్న వైద్య ఖ‌ర్చుల కోసం అంద‌రి ద‌గ్గ‌ర చేయి  చాచాల్సి వ‌చ్చింద‌ని, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సాయం చేసేందుకు నిరాక‌రించార‌నే విష‌యాన్ని చెప్ప‌డం ద్వారా స‌మాజంలో మాన‌వ సంబంధాల డొల్ల‌త‌నాన్ని ఆమె బ‌య‌ట పెట్టారు. అతి క‌ష్ట‌మ్మీద నాన్న‌కు మూడు స‌ర్జ‌రీలు చేయించి కాపాడుకోగ‌లిగాన‌ని, ఆ స‌మ‌యంలో త‌న భ‌ర్త అండ‌గా నిలిచాడ‌ని లాస్య తెలిపారు.

అయితే నాన్న‌కు ఇష్టం లేని పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల ఆయ‌న మూడేళ్ల పాటు త‌న‌తో మాట్లాడ‌లేద‌ని చెప్పారు. అలాంటి నాన్న ఇప్పుడు త‌న భ‌ర్త‌ను కొడుకు అని చెప్పుకుంటాడ‌ని చెప్ప‌డం ద్వారా తండ్రితో పాటు జీవిత భాగ‌స్వామి గొప్ప‌త‌నాన్ని ప్రేక్ష‌కుల‌కు చెప్పిన‌ట్టైంది.

ఇక్క‌డ లాస్య త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. ప్రేమించిన వాడిని రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్న‌ట్టు లాస్య తెలిపారు. అయితే మ‌న‌సుకు ఇష్ట‌మైన వాడిని మ‌నువాడి ఏడ‌డుగులు న‌డిచిన జీవిత భాగ‌స్వామి గురించి ఏడేళ్ల పాటు ఎవ‌రికీ చెప్ప‌ని విష‌యాన్ని బిగ్‌బాస్ వేదిక‌గా లాస్య వెల్ల‌డించారు. 

త‌న పెళ్లి గురించి ఏడేళ్ల పాటు ఏ ఒక్క‌రికీ చెప్ప‌కుండా ర‌హ‌స్యంగా ఉంచిన‌ట్టు తెలిపారు. యాంక‌ర్‌గా షోల‌కు వెళ్లిన‌ప్పుడు క‌జిన్ అని త‌న భ‌ర్త గురించి చెప్పాల్సి వ‌చ్చిందంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

ప్ర‌తి రాత్రి భ‌ర్త‌ను గుర్తు చేసుకుంటాన‌ని, ఆయ‌న్ని చాలా మిస్ అవుతున్న‌ట్టు లాస్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిగ్‌బాస్‌లో తాను ఉంటున్న‌ప్ప‌టికీ మీరు చాలా గుర్తు వ‌స్తున్నార‌ని భ‌ర్త గురించి చెప్పే సంద‌ర్భంలో లాస్య భావోద్వేగం కావ‌డంతో పాటు అంద‌ర్నీ త‌న మూడ్‌లోకి తెచ్చుకునేలా చెప్ప‌గ‌లిగారు.  

కుట్ర‌లు, కుయుక్తులు? ఇదేనా పాత్రికేయ ధ‌ర్మం 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?