Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

బీజేపీ మాజీ మంత్రి నుంచి జేడీకి ప్రాణ హాని!

బీజేపీ మాజీ మంత్రి నుంచి జేడీకి ప్రాణ హాని!

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి జై భారత్ పార్టీ తరఫున పోటీలో ఉన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణ హాని ఉందంటూ హఠాత్తుగా షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన విశాఖ పోలీసులను కలసి ఫిర్యాదు కూడా చేశారు. దాంతో ఇది రాజకీయ సంచలనంగా మారింది. జేడీకి ఎవరి నుంచి ముప్పు అన్న చర్చకు తెర లేచింది. అయితే తన ప్రాణాలకు ఎవరి నుంచి ముప్పు పొంచి ఉందో జేడీ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీజేపీ కీలక నేత కర్నాటక రాష్ట్రానికి చెందిన గాలి జనార్ధన్‌ రెడ్డి నుంచి తన ప్రాణానికి హాని ఉందని తనని రక్షించాలని జేడీ కోరారు. ఆయన విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవి శంకర్ కి ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయం స్పష్టం చేశారు. గతంలో తాను సీబీఐ అధికారి హోదాలో గాలి జనార్ధనరెడ్డిని అరెస్ట్ చేసినందుకు గానూ తాను విశాఖలోనే అంతమొందించేందుకు భారీ కుట్ర చేస్తున్నారు అంటూ జేడీ ఆరోపించారు.

ఇప్పటికి పుష్కర కాలం క్రితం 2011లో అక్రమ మైనింగ్ కేసులో బళ్ళారిలో గాలి జనార్ధనరెడ్డిని జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేశారు. అప్పట్లో అది సెన్సేషన్ అయింది. ఆ తరువాత గాలి రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్నీ పడ్డారు. అయితే గాలి బెయిల్ మీద వచ్చి చాలా కాలం అయింది. జేడీ సీబీఐ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి అయిదారేళ్ళు అయింది. జేడీ 2019లో విశాఖ నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి చూసారు.

ఆయన రాజకీయాల్లో చాలా కాలంగా ఉంటున్నారు. ఆయనకు ఎప్పుడూ ప్రాణ ముప్పు ఉన్నట్లుగా ఎవరూ అనుకోలేదు. ఇపుడు సడెన్ గా ఆయన ఈ ఫిర్యాదు ఇవ్వడంతో ఏమి జరుగుతోంది అన్న చర్చ సాగుతోంది. ఇందులో కుట్ర కోణం చేదించాలని అంతా కోరుతున్నారు. ముఖ్యంగా బీజేపీలో ఉన్న మాజీ మంత్రి కాబట్టి ఆ పార్టీ కూడా ఈ ఆరోపణలతో ఇరుకున పడుతోంది. ఈ మధ్యనే ఆయనను తిరిగి బీజేపీలోకి కమలం పార్టీ వారు తీసుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?