Advertisement

Advertisement


Home > Politics - Opinion

జ‌గ‌న్‌ను ఉద్యోగులు ఎందుకు స‌మ‌ర్థించాలంటే...!

జ‌గ‌న్‌ను ఉద్యోగులు ఎందుకు స‌మ‌ర్థించాలంటే...!

ఎన్నిక‌లు స‌మీపించాయి. ప్ర‌తి ఒక్క‌రూ తెలివైన తీర్పు ఇవ్వాల్సిన త‌రుణం ఇది. ఏ ప్ర‌భుత్వం వ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో బాగా ఆలోచించి, ఈవీఎంలో తీర్పు ఇవ్వాల్సి వుంటుంది. ఈ ఎన్నిక‌ల్లో ఉద్యోగులు ఎటు వైపు నిల‌వాల‌నే ప్ర‌శ్న ఉద‌యించింది. పాత పెన్షన్ స్కీం తీసుకురాని జగన్ ను వ్యతిరేకించాలా? లేక 20 రాష్ట్రాల కంటే బాధ్యతగా Guaranteed Pension Scheme తెచ్చిన జగన్ ను సమర్థించాలా? అనే ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రికి వారు బాగా ఆలోచించాలి.

కొత్త పెన్షన్ విధానాన్ని అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలోని  NDA ప్రభుత్వం 01.01.2004 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ రోజు నుంచి దేశమంతా కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత రాజస్థాన్, ఛత్తీస్‌గ‌ఢ్‌, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించడమో, పునరుద్ధరించాలని నిర్ణయించడమో జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రాలలో వరుసగా బిజెపి, బిజెపి, ఆప్, కాంగ్రెస్, సిక్కిం క్రాంతికారి మోర్చా, జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి.

మిగతా రాష్ట్రాలన్నీ కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్నాయి.

ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్న బిజెపి రాష్ట్రాలు:

1. అరుణాచల ప్రదేశ్, 2.అస్సాం, 3.గోవా, 4.గుజరాత్, 5.హర్యానా, 6.మధ్య ప్రదేశ్, 7.మణిపూర్, 8.త్రిపుర, 9.ఉత్తర్ ప్రదేశ్, 10.ఉత్తరాఖండ్

ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్న సిపిఎం పాలిత రాష్టం:

11. కేరళ

ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు:

12. తెలంగాణ, 13.కర్నాటక

ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్న ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు :

14.మేఘాలయ (NPP), 15.మిజోరాం (ZPM), 16.నాగాలాండ్ (NDPP), 17.ఒడిస్సా (BJD), 18.పుదుచ్చేరి (AINRC), 19.తమిళనాడు (డిఎంకే), 20.పశ్చిమ బెంగాల్ (టీఎంసీ), 21.ఆంధ్రప్రదేశ్ (వైసీపీ)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో కొత్త పెన్షన్ స్కీం ను తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నిలుపుకోలేకపోయారు. 

పాత పెన్షన్స్ స్కీమ్‌ను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థికపరమైన సంక్లిష్టతను, ఇబ్బందుల్ని వివరించారు. కొత్త పెన్షన్ స్కీమ్ రద్దు చేయలేకపోవడం, మరో రెండు మూడు హామీలు అమలు చేయలేదు కాబట్టే, ఆయన తన మేనిఫెస్టోను 98% అమలు చేశాను అని చెబుతూ వస్తున్నారు.

అయితే ప్రస్తుతం కొత్త పెన్షన్ స్కీం అమలవుతున్న మిగతా 20 రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానో, కేంద్ర ప్రభుత్వం లాగానో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల ఈ కీలకమైన సమస్యను పట్టించుకోకుండా లేరు. 

పాత పెన్షన్ విధానానికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించారు. గ్యారెంటీ పెన్షన్ స్కీం పథకాన్ని తెచ్చారు. హైబ్రిడ్ మోడల్ గా ఉన్న ఈ కొత్త గ్యారెంటీ పెన్షన్ స్కీం అన్ని రాష్ట్రాలకు ఆచరణీయమైన పెన్షన్ పథకంగా ఉండబోతుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం అమలు ద్వారా, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగి రిటైనప్పుడు అతని మూల వేతనం ఎంత ఉంటుందో, అందులో సగం మొత్తాన్ని రిటైర్ అయ్యాక పెన్షన్ గా చెల్లిస్తారు.

ఇదీ విషయం! ఇప్పుడు మీరే ఆలోచించండి !

పాత పెన్షన్ స్కీం తీసుకురాని జగన్ ను వ్యతిరేకించాలా?

20 రాష్ట్రాల కంటే బాధ్యతగా, కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగా స్పందించి Guaranteed Pension Scheme తెచ్చిన జగన్‌ను సమర్థించాలా?

ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పాలి! కరోనాకు పారాసెటమాల్ పరిష్కారమని దేశంలో జగన్ ఒక్కడే ధైర్యంగా చెప్పారు. అప్పుడు అతన్ని అపహాస్యం చేశారు! ఆ తర్వాత అందరం పారాసెటమాల్ వేసుకున్నాం కదా!!

మానవజాతి చరిత్రలో అందరికంటే ముందు ఒక కొత్త ఆలోచన ప్రకటించిన ఎవరినైనా ముందు ఎగతాళి చేస్తారు, తర్వాత ప్రతిఘటిస్తారు, ఆ తర్వాత అందరూ అతనినే అనుసరిస్తారు !

జగన్ విషయంలో జరుగుతున్నది కూడా అదే !!

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు, విజ‌య‌వాడ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?