Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అదిగో కూటమి - ఇదిగో సన్మానం

అదిగో కూటమి - ఇదిగో సన్మానం

ఎవరి లెక్కలు వారివి. ఎవరి సరదాలు వారివి. ఎవరి ఏర్పాట్లు వారివి.  అంతే కదా.. మనిషి ఆశాజీవి. అది లేకుంటే మనుగడ అడుగు ముందుకు పడదు.

టాలీవుడ్ లో ఓ బడా నిర్మాత ఇప్పుడు అదే ఆలోచనలో వున్నారట. కూటమి ప్రభుత్వం వస్తే, భారీ ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఆ వేదిక మీద పవన్ ను చంద్రబాబును కలిపి ఇండస్ట్రీ మొత్తం సన్మానించేలా చేయాలన్నది ఆలోచనట. ఇప్పటికే తన సన్నిహితులతో ఈ ఆలోచన పంచుకున్నారట.

కూటమి ప్రభుత్వం వస్తే టాలీవుడ్ కన్నా సంబర పడేది మరోటి వుండదు. ఎందుకంటే టాలీవుడ్ లో ఎక్కువ మంది కూటమి అనుకూలంగా వున్నవారే. ఇది పాత సంగతే. ఇప్పుడు దానికి మెగా క్యాంప్ కూడా తోడయింది. అంటే దాదాపుగా టాలీవుడ్ మొత్తం కూటమి వైపు మొగ్గినట్లే.

ఎక్కడో ఏ పోసాని లాంటి వాళ్లో ఒకరిద్దరు తప్ప. గత అయిదేళ్లుగా టాలీవుడ్ సైలంట్‌గా వుంది. ఎటూ మొగ్గనట్లు, న్యూట్రల్ గా ఫోజ్ పెట్టి వుండిపోయింది. టికెట్ రేట్లు కావాల్సినపుడు మంత్రులను మంచి చేసుకుని, కావాల్సింది ఇచ్చి, అధికారులకు ఇవ్వాల్సింది ఇచ్చి పనులు చేయించుకుంటూ వచ్చారు.

ఇక ఇప్పుడు కూటమి వస్తే టాలీవుడ్ ఇంకా న్యూట్రల్ లుక్ పెట్టాల్సిన అవసరం లేదు. టాప్ టు బాటమ్ దాదాపు అన్నీ పెద్ద నిర్మాణ సంస్థలు అటు పవన్ వైపు నుంచో, ఇటు చంద్రబాబు వైపు నుంచో కూటమి అనుకూలంగానే వున్నాయి. అందుకే ఆ బడా నిర్మాత అలాంటి ప్లాన్ చేసారని తెలుస్తోంది.

కానీ ఒకటే అనుమానం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా టాలీవుడ్ వైపు నుంచి కంబైన్డ్ గా ఎలాంటి కార్యక్రమం జరగలేదు. అందువల్ల ఆయనను కూడా ఇదే వేదిక మీదకు తీసుకవచ్చి, ఒకేసారి పని కానిచ్చేస్తారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?