మొన్న పవిత్ర మృతి.. ఈరోజు చందు ఆత్మహత్య

టీవీ ఇండస్ట్రీలో మరో విషాధం చోటుచేసుకుంది. త్రినయని సీరియల్ నుంచి మరో ఆర్టిస్ట్ కన్నుమూశాడు. మొన్నటికిమొన్న త్రినయని ఫేమ్ పవిత్ర జయరాం మృతి చెందగా,  అదే సీరియర్ కు చెందిన చంద్రకాంత్ అలియాస్ చందు…

టీవీ ఇండస్ట్రీలో మరో విషాధం చోటుచేసుకుంది. త్రినయని సీరియల్ నుంచి మరో ఆర్టిస్ట్ కన్నుమూశాడు. మొన్నటికిమొన్న త్రినయని ఫేమ్ పవిత్ర జయరాం మృతి చెందగా,  అదే సీరియర్ కు చెందిన చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు మరణాలకు ఓ కనెక్షన్ ఉంది.

పవిత్ర జయరాం, చందు చాన్నాళ్లుగా కలిసి సీరియల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర బంధం ఉన్నట్టు తెలుస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన, తను ప్రేమిస్తున్న పవిత్ర చనిపోవడంతో చందు తట్టుకోలేకపోయాడు.

ప్రతి రోజూ పవిత్రను తలుచుకుంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆమె మరణించిందనే విషయాన్ని అంగీకరించలేదు. రోజూ పెడుతున్నట్టే, పవిత్ర చనిపోయిన తర్వాత కూడా ఆమెపై ఇనస్టా పోస్టులు పెట్టాడు. పవిత్ర లేకుండా తను బతకలేనంటూ ప్రకటించిన అతడు, నిన్న‌ హైదరాబాద్ మణికొండలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు.

చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు, ఆత్మహత్యపై ఆరా తీస్తున్నారు.