చంద్రబాబునాయుడి రాజగురువు పత్రిక ఓ ఎస్పీని వెనకేసుకొచ్చింది. ఇది చాలదా… ఆ ఎస్పీ టీడీపీకి ఏజెంట్‌గా పని చేశారనే ఆరోపణలు నిజమని నమ్మడానికి. ఎస్పీలైనా, కలెక్టర్లైనా తమ సిఫార్సుల మేరకే నియమించాలనే రీతిలో రాజగురువు పత్రిక కథనాలు రాసిన సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో కొంత మంది ఎస్పీలను మార్చి, కొత్త వారిని ఈసీ నియమిస్తే, వీళ్లా జిల్లా పోలీస్ బాస్‌లు అంటూ ఎల్లో పత్రిక నిలదీస్తూ కథనం రాసింది.
కానీ ఇదే ఈసీ నియమించిన పల్నాడు ఎస్పీ విషయంలో మాత్రం … ఎల్లో పత్రిక మద్దతుగా నిలుస్తూ, ఆయన్ను సస్పెండ్ చేయడం ఏంటని ఆవేదనతో అక్షరపర్యంతమైంది. పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ గొప్ప అధికారి అని, అలాంటి సమర్థుడిని ఎలా సస్పెండ్ చేస్తారని బాబు భక్త పత్రిక కథనం రాయడం గమనార్హం. పల్నాడులో ఎన్నికల రోజు, అలాగే అనంతరం హింసాకాండకు ఎస్పీని బాధ్యుడిని చేయకుండా మరెవరిని చేయాలో ఎల్లో పత్రిక యజమానిని అడగాలేమో!
పల్నాడు ఎస్పీకి డీజీపీ, మాచర్ల ఎన్నికల ప్రత్యేక అధికారి అయిన ఐజీ, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ సహకరించలేదని రాయడం ఆ పత్రికకే చెల్లింది. ఎన్నికల రోజు పల్నాడు ఎస్పీ టీడీపీ ఏజెంట్‌గా పని చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీకి కొమ్ము కాసి, రిగ్గింగ్‌కు సహకరించారని వైసీపీ నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ కుటుంబ సభ్యులకు టీడీపీ ముఖ్య నేతలతో అనుబంధాల గురించి చర్చ జరిగింది.
పల్నాడు ఎస్పీ వైసీపీపై కక్ష కట్టినట్టు వ్యవహరించి, బందోబస్తు పెట్టారనే ఆరోపణలున్నాయి. టీడీపీ రిగ్గించ్కు పాల్పడుతుందనే బూత్‌ల వద్ద తక్కువ పోలీస్ ఫోర్స్ పెట్టారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అన్నీ పరిశీలించిన తర్వాతే పల్నాడు ఎస్పీ సస్పెన్షన్‌కు ఆదేశాలు ఇచ్చారు. తమ కోసం ఏజెంట్‌గా పని చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారని పచ్చ పత్రిక తెగ బాధపడుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.