జగన్ మరోసారి అధికారంలోకి వస్తే..

ఆంధ్రలో జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే అంతా మంచి జరుగుతుందని వైకాపా జనాలు అంటారు. అబ్బే కాదు. రాష్ట్రం అధోగతి పాలవుతుందని తేదేపా వాళ్లు అంటారు. కానీ ఎవరి వాదన  ఎలా వున్నా,…

ఆంధ్రలో జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే అంతా మంచి జరుగుతుందని వైకాపా జనాలు అంటారు. అబ్బే కాదు. రాష్ట్రం అధోగతి పాలవుతుందని తేదేపా వాళ్లు అంటారు. కానీ ఎవరి వాదన  ఎలా వున్నా, పక్కాగా జరిగే కొన్ని విషయాల్లో మాత్రం క్లారిటీ వుంది. అలా జరగడం మాత్రం పక్కా.

ఈనాడు పత్రిక రాతలు జనం నమ్మడం పూర్తిగా మానేస్తారు. 2009 లో కావచ్చు 2024లో కావచ్చు ఈనాడు తన పత్రిక పరువు అంతా తాకట్టు పెట్టి మరీ యాంటీ జగన్ రూట్ తీసుకుంది. 2024లో అయితే అసలు ఆ పత్రిక చేసిన ప్రయత్నం అనన్యసామాన్యం. ఎన్ని వందల వార్తలు, ఎన్ని కాన్సెప్ట్ లు, ఎలాంటి ప్రచారం. ఇన్ని చేసినా కూడా జనం జగన్ నే గెలిపించారు అంటే, ఇక ఈనాడు రాతలు జనం నమ్మడం వదిలేసినట్లే. అసలే ప్రింట్ మీడియా తగ్గిపోయింది. ఈ పేపర్ మీద ముందుకు సాగుతోంది. ఇలాంటి టైమ్ లో జగన్ అధికారంలోకి వస్తే అది ఈనాడుకు నూటికి నూరం శాతం మైనస్ నే.

ఇక ఎబిఎన్, టీవీ5 విజువల్ మీడియాలో చేసిన యాంటీ ప్రచారం తక్కువేమీ కాదు. రోజు రోజు డిస్కషన్లు, జర్నలిస్ట్ లు కూడా పార్టీ జనాలుగా మారిపోయినట్లుగా మాటలు. ఆ తరువాత అవన్నీ ముక్క ముక్కలు చేసి యూ ట్యూబ్ నింపడం. ఆపైన వాట్సాప్ లో చలామణీ. ఇంత చేసినా జగన్ గెలిచి ప్రభత్వం ఏర్పాటు చేస్తే ఇక ఈ చానెళ్ల మాటలు ప్రజల మీద అంతగా ప్రభావం చూపడం లేదని క్లారిటీ వస్తుంది.

ఇవి ఇలా వుంటే మీడియాకు ప్రకటనే ఆదాయం. గత అయిదేళ్లుగా ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించింది. ఇక ఇప్పుడు అసలు ప్రకటనలు వుండకపోవచ్చు. టోటల్ గా ప్రింట్ మీడియా, విజువల్ మీడియాలు రెండూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల ఈ రెండు రంగాలు ఇంకా ట్రబుల్స్ లో చిక్కుకోవ్చు.

అనేక యూ ట్యూబ్ చానెళ్లు, వెబ్ మీడియాలు కేవలం ఎన్నికల టైమ్ లో ఇటు వైకాపా కావచ్చు, అటు తేదేపా కావచ్చు. వాటి మద్దతు కోసం రంగంలోకి దిగి, చేతి ఖర్చుతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇలాంటివి అన్నీ మూత పడతాయి.

అమరావతి మీద ఇప్పటికీ ఆశలు సజీవంగా వున్నాయి అంటే ఈ ఎన్నికలే కారణం. ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించి అమరావతిని మళ్లీ పైకి లేపవచ్చు అనుకున్నారు. జగన్ గెలిస్తే ఈసారి వెళ్లి నేరుగా విశాఖ నుంచే పాలన మొదలుపెట్టేయవచ్చు. అది జరిగితే విశాఖకు వైభోగం, అమరావతికి నైరాశ్యం తప్పవు.

13 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు శంకుస్ధాపన చేసి ఒక్కోటీ అయిదు వందల కోట్లతో నిర్మాణాలు తలపెట్టారు. ఫస్ట్ ఫేజ్ లో కొన్ని రెడీ అవుతున్నాయి. జగన్ ప్రభుత్వం వస్తే అయిదేళ్లలో 13 మెడికల్ కాలేజీలు జనం కళ్ల ముందుకు వస్తాయి. అలాగే నిర్మాణంలో వున్న ఓడరేవులు కూడా. ఇదే జరిగితే అభివృద్ది అనే జనం కూడా జగన్ ను అభిమానించే అవకాశం వుంది.

ఇవన్నీ ఇలా వుంచితే జగన్ కు ఓ సామాజిక వర్గం అంటే అంతగా గిట్టదు అనే మాట వుంది. ఆ వర్గం ఇప్పుడు చాలా వరకు ఆల్టర్ నేటివ్ అవకాశాలు ఎదుర్కోవాల్సి వుంటుంది. ఇప్పటికి స్థిరమైన వ్యాపారాలు వున్నవారు ఏదో విధంగా కొనసాగుతారు. ప్రభుత్వం వస్తే దాని ఆధారంతో బతికేద్దాం అనుకున్నవారు మాత్రం వేరే దారులు వెదుక్కోవాల్సిందే.

జగన్ మీద హద్దుల దాటి నోరు పారేసుకున్నవారు కూడా వున్నారు. ఇప్పుడు వారంతా ఏ విధంగా పరిస్థితిని హ్యాండిల్ చేస్తారు అన్నది కూడా పాయింట్. ఇదంతా జగన్ అధికారంలోకి వస్తేనే..

అదే కూటమి అధికారంలోకి వస్తే.. సమస్య ఒక్కరికే అది జగన్ కు మాత్రమే. జగన్ వెనుక వున్న సాక్షి మీడియా కు పెద్దగా సమస్య వుండదు. వేరే విజువల్ మీడియాలు మెల్లగా తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటాయి. వాటికి ఆ మాత్రం వెసులు బాటు వుంది.