దొంగ, తప్పుడు ఓట్లకు చెల్లుబాటు కోరుతున్న టీడీపీ!

తెలుగుదేశం నాయకులు ఎంతైనా చిత్రమైన బుద్ధులున్నవాళ్లు. తాము గోల చేస్తే చాలు.. తమ గోల మాత్రమే  వాస్తవం అని ప్రజలు నమ్ముతారని వారి కోరిక. అసలు పాయింట్ ఎలా ఉన్నప్పటికీ కూడా తమ గోలను…

తెలుగుదేశం నాయకులు ఎంతైనా చిత్రమైన బుద్ధులున్నవాళ్లు. తాము గోల చేస్తే చాలు.. తమ గోల మాత్రమే  వాస్తవం అని ప్రజలు నమ్ముతారని వారి కోరిక. అసలు పాయింట్ ఎలా ఉన్నప్పటికీ కూడా తమ గోలను వాస్తవంగా, సబబైన డిమాండుగా ప్రజలను నమ్మించడానికి పచ్చమీడియా తన శక్తివంచన లేకుండా పనిచేస్తుందని వారి నమ్మకం. అదే క్రమంలో ఇప్పుడు ఎన్నికల పర్వంలో మరొక తప్పుడు పనిని, దొంగపనిని చెల్లుబాటు అయ్యేలా చూడాలని బహిరంగంగా కోరుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. పోస్టల్ బ్యాలెట్లు ఈ దఫా ఎన్నికల్లో చాలా పెద్దసంఖ్యలో పోలయ్యాయి. గత 2019 ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్లు సుమారు 2.78 లక్షలు కాగా.. ఈసారి 4.5 లక్షల వరకు పోలయ్యాయ. దాదాపుగా 1.7 లక్షల భారీ తేడా ఉన్నదంటే సీరియస్ గానే పరిగణించాలి. అయితే ఇదంతా కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు వెల్లువలా పట్టుదలతో వచ్చి వేసిన ఓటు అని పచ్చమీడియా ప్రచారం చేస్తున్నది. అయితే.. పోస్టల్ బ్యాలెట్ల ముసుగులో చాలా పెద్దసంఖ్యలో దొంగఓట్లు, నకిలీ తప్పుడు ఓట్లు వేశారని కూడా ఉద్యోగులే అంటున్నారు.

సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగి ముందుగానే సంబంధిత వర్గాల నుంచి తీసుకుంటారు. అయితే.. అలా ఉద్యోగికి బ్యాలెట్ పత్రం ఇచ్చేప్పుడు.. అధికారికంగా దానిని ధ్రువపరుస్తూ స్టాంపు సీల్ వేయాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అధికారులు అలా స్టాంపు, సీలు వేయాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ వెనుక ప్రిసైడింగ్ అధికారి విధిగా సంతకం చేయాల్సి ఉంటుంది.అయితే.. ఇలాంటి స్టాంపు, సీలు లేకుండా, ప్రిసైడింగ్ అధికారి సంతకం కూడా లేకుండా అనేక ఓట్లు పోలైనట్టుగా తెలుస్తోంది. అందువల్లనే ఏకంగా 4.4 లక్షల వరకు భారీగా ఓట్లు పోలైనట్టు అంటున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అలాంటివన్నీ కూడా దొంగఓట్లు గానే గుర్తిస్తారు.

కానీ ట్విస్టు ఏంటంటే.. స్టాంపు, సీలు లేకపోయినా, ప్రిసైడింగ్ అధికారి సంతకం లేకపోయినా.. ఆ ఓట్లన్నిటినీ కూడా లెక్కించి తీరాలని తెలుగుదేశం నేతలు అశోక్ బాబు, ఏఎస్ రామక్రిష్ణ కోరుతున్నారు.ఈ మేరకు ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అధికార్లకు ఆదేశాలివ్వాలట. తమ పార్టీ వారితో పోస్టల్ బ్యాలెట్ కింద ఎలాంటి అధికారిక ధ్రువీకరణలు లేని దొంగ ఓట్లు వేయించి.. వాటన్నింటినీ పరిగణించి తీరాలంటూ మళ్లీ ఈసీని కోరడం తెలుగుదేశానికి మాత్రమే చెల్లుతోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.