ఒకప్పుడు హీరోయిన్ కు పెళ్లయిందంటే కెరీర్ క్లోజ్ అయినట్టే. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పెళ్లి చేసుకొని మరీ బిజీ అవుతున్నారు భామలు. ఈ విషయంలో టాలీవుడ్ కాస్త వెనకబడి ఉందని అంటోంది కాజల్.
బాలీవుడ్ తో పోలిస్తే, టాలీవుడ్ లో పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయని అభిప్రాయపడింది. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని, దానికి తనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెబుతోంది.
“బాలీవుడ్ తో పోలిస్తే, పెళ్లయిన హీరోయిన్లకు టాలీవుడ్ లో అవకాశాలు కాస్త తక్కువగానే వస్తున్నాయి. హిందీలో అలియాభట్, దీపిక పదుకోన్, కత్రినా కైఫ్ కు వస్తున్నంత ఎక్కువగా సౌత్ లో పెళ్లయిన హీరోయిన్లకు ఛాన్సులు రావడం లేదు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతోందని నాకు అనిపిస్తోంది.”
పెళ్లి తర్వాత తన జీవితం పెద్దగా మారలేదంటోంది కాజల్. తన భర్త, అతడి కుటుంబ సభ్యులు తనను బాగా అర్థం చేసుకున్నారని, సపోర్ట్ గా నిలుస్తున్నారని తెలిపింది. అందుకే తను ప్రశాంతం గా షూటింగ్స్ లో పాల్గొంటున్నానని కూడా వెల్లడించింది.
పెళ్లి అనేది వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను పెద్దగా మార్చలేదని, అందుకే పెళ్లయిన వెంటనే సినిమాలు రీ-స్టార్ట్ చేశానని చెబుతోంది. భర్త గౌతమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను సెట్స్ లో కలుస్తుంటాడని, తను తన భర్తకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానిని అంటోంది. తను బిజీగా ఉంటే తన మేనేజర్ లేదా మేకప్ మేన్ కు గౌతమ్ కాల్ చేస్తాడని చెబుతోంది.