Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఛీఛీ.. జ‌గ‌న్‌పై బాబు ఇంత నీచ‌మా?

ఛీఛీ.. జ‌గ‌న్‌పై బాబు ఇంత నీచ‌మా?

చంద్ర‌బాబునాయుడు చాలా నీచ‌స్థాయికి దిగ‌జారార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై స‌భ్య‌త‌, సంస్కారం మ‌రిచి చంద్ర‌బాబు దూష‌ణ‌కు దిగారు. అన‌కాప‌ల్లిలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మయ్యాయి. చివ‌రికి త‌న వాళ్లు సైతం... జ‌గ‌న్‌పై ఆయ‌న కామెంట్స్‌కు అవాక్క‌య్యారు.

ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టంపై అసెంబ్లీలో మ‌ద్ద‌తు ప‌లికిన చంద్ర‌బాబునాయుడు, ఇప్పుడేమో దాన్ని అడ్డం పెట్టుకుని రైతుల్ని భ‌య‌పెట్టి రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నే కుట్ర‌కు తెర‌లేపారు. విధానాల ప‌రంగా జ‌గ‌న్‌ను ఎన్నైనా విమ‌ర్శించొచ్చు. కానీ చంద్ర‌బాబునాయుడు ఆ ప‌ని చేయ‌డం లేదు.

జ‌గ‌న్‌పై అస‌భ్యంగా మాట్లాడుతూ త‌నలోని అస‌హ‌నాన్ని, ఓడిపోతాన‌నే భ‌యాన్ని బ‌య‌ట పెట్టుకున్నారు. భూహ‌క్కు చ‌ట్టం తీసుకొచ్చే హ‌క్కు నీ త‌ల్లి మొగుడు ఇచ్చాడా? మీ అమ్మ‌మ్మ మొగుడు ఇచ్చాడా? మీ నానమ్మ మొగుడు ఇచ్చాడా? అంటూ తీవ్ర వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగారు. దీంతో స‌భ‌కు వ‌చ్చిన వారంతా ఆశ్చ‌ర్యపోయారు. 

ఇదే చ‌ట్టానికి టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యం బ‌య‌ట ప‌డింది. దీంతో వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ఇలా జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌కు పాల్ప‌డ్డార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. చంద్ర‌బాబు త‌న పెద్ద‌రికాన్ని కోల్పోయార‌నే మాట వినిపిస్తోంది. అస‌భ్య వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబే ఊతం ఇచ్చేలా మాట్లాడ్డంతో, ప్ర‌త్య‌ర్థులు ఏమైనా మాట్లాడ్డానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టైంది. కానీ జ‌గ‌న్ మాత్రం ఎప్పుడూ ఇలా దూష‌ణ‌ల‌కు దిగ‌లేదు. బాబు, జ‌గ‌న్ మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడాను ఏపీ స‌మాజం గుర్తిస్తోంది.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?