అదో పే..ద్ద సినిమా స్టూడియో. అదో పాపులర్ సినిమా బ్యానర్. గమ్మత్తేమిటంటే ఈ రెండింటి అధినేతలకు కాస్త మంచి స్నేహ బంధాలే వున్నాయి.
కానీ తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే కదా. అందుకే ఆ మధ్య ఓ రోజు షూటింగ్ అనుకుంటే జరగకుండా ఆపేసారట సదరు స్టూడియో అధికారులు.. కారణం ఏమిటంటే ఈ సినిమా సంస్థ చెల్లించాల్సిన స్టూడియో చాలా బిల్లులు పెండింగ్ లో వుండడమే.
ఈ సంస్థ మీద టాలీవుడ్ లో టాక్ చాలా ఎక్కువగా వుంది. బిల్లులు ఒకంతట క్లియర్ చేయరని, చిన్న చిన్న బిల్లులు సైతం పెండింగ్ లో వున్నాయని, చెక్ లు బౌన్స్ అవుతున్నాయని గ్యాసిప్ లు వున్నాయి. నిజానికి ఆ సంస్థ కు బోలెడు పెట్టుబడి నిధులు వున్నాయని. కానీ ఎందుకో పేమెంట్లు మాత్రం త్వరగా చేయరనే వెర్షన్ కూడా వుంది.
మొత్తం మీద ఏమైతేనేం సదరు స్టూడియోకి కూడా కాస్త గట్టిగానే బకాయి పడ్డారు. మరి అందుకే చిన్న ఝలక్ ఇవ్వాలనేమో? ఆ సంస్థ నిర్మించే సినిమా షూట్ ఒకటి ఒక రోజు ఆపేసారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.