Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైసీపీ ఎంపీ గెలుపుకు ఆ మెజారిటీ చాలు?

వైసీపీ ఎంపీ గెలుపుకు ఆ మెజారిటీ చాలు?

వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమె విశాఖ అడపడుచుని అంటూ జనంలోకి వస్తున్నారు. పక్కా లోకల్ అన్నది ఆమెకు మరో ప్లస్ పాయింట్. బలమైన సామాజిక వర్గం నుంచి ఆమె పోటీలో ఉన్నారు. గతంలో విశాఖ ఎంపీలుగా చేసిన వారు ఎవరూ తూర్పు కాపుల నుంచి నెగ్గలేదు.

దాంతో ఇవన్నీ సానుకూల అంశాలుగా ఉన్నాయి. అయితే విశాఖ ఎంపీ అభ్యర్ధి గెలుపునకు బాటలు వేసే అంశాలు ఏవి అన్న చర్చ వస్తోంది. విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. భీమిలీ ఎస్ కోట, విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణం, ఉత్తరం, గాజువాకల ఓటర్లు ఎంపీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఒక ఓటు వేయాలి.

విశాఖ ఎంపీ పరిధిలో రాజకీయ సమీకరణాలు చూస్తే ఎస్ కోట, విశాఖ నార్త్, విశాఖ పశ్చిమ, విశాఖ సౌత్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. విశాఖ తూర్పు భీమిలీ, గాజువాక లో హోరా హోరీ పోరు టీడీపీ వైసీపీల మధ్య ఉంది. ఇక వైసీపీకి అనుకూలంగా ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లలో మూడు చోట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ బయటపడినా విశాఖ పశ్చిమంలో మాత్రం భారీ మెజారిటీనే ఆశిస్తోంది.

అక్కడ వైసీపీ అనూహ్యంగా పుంజుకుంది. దాంతో ఈ ఒక్క సీటులో వచ్చే మెజారిటీయే విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని గెలిపిస్తుందని ఆ పార్టీ ధీమాగా ఉంది. దాంతో విశాఖ ఎంపీ సీటు మరోసారి వైసీపీ పరం అవుతుందా లేక రెండవసారి పోటీ చేస్తూ ఎంపీ కావాలని పట్టుదలగా ఉన్న టీడీపీ అభ్యర్ధి శ్రీ భరత్ కి అవకాశం ఉంటుందా అన్నదే హాట్ డిస్కషన్ గా ఉంది.  జనాల తీర్పు ఎలా ఉన్నా వైసీపీ ధీమా చూస్తే విశాఖ ఎంపీ ఈసారి కూడా తమదే అని చెబుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?