కల్కి సినిమా ప్రమోషన్ మెల మెల్లగా హీట్ అందుకుంటోంది. సినిమాలో హీరో క్యారెక్టర్ భైరవ కోసం డిజైన్ చేసిన సూపర్ పవర్ కార్ మోడల్ ను రివీల్ చేసే టైమ్ వచ్చింది. 22న ఈ కార్ మోడల్ ను రివీల్ చేస్తామంటూ ఓ ప్రోమో కట్ చేసి వదిలారు. చాలా ఇంట్రస్టింగ్ గా కట్ చేసారు ఈ ప్రోమోను.
ఈ సూపర్ పవర్ కార్ డిజైనింగ్ కు ఏకంగా పలు దేశాల టెక్నీషియన్లు తీసుకున్నారు. అంటే జస్ట్ లుకింగ్ మోడల్ మాత్రమే కాదు, వర్కింగ్ మోడల్ గా కూడా వుండాలన్న ఆలోచన కావచ్చు. ఎంత సిజి వర్క్ చేసినా, కొంతయినా వర్కింగ్ మోడల్ వుండాలని అనుకున్నట్లు వుంది.
జేమ్స్ బాండ్ సినిమాల్లో ఇలాంటి సూపర్ కార్ లను జనం చూసారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లు వుండాలి. ఎసికి, టివి రిమోట్ వున్నట్లు కార్ కు కూడా వుంటే అన్న దగ్గరే వైవిధ్యంగా ఆలోచించారు. రిమోట్ కు బుర్ర లేదా బ్రెయిన్ అన్నట్లు క్రియేట్ చేసారు. బుర్రకు బాడీ కోసం అన్నట్లు ఈ ప్రోమో కట్ చేసారు.
ప్రోమో చివర్లో ప్రభాస్ గెటప్ చూపించారు. ప్రోమో ఆద్యంతం ఫన్ మిస్ కాకుండా చూసుకున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా మేకింగ్ విషయంలోనే కాదు. ప్రమోషన్ కంటెంట్ విషయంలో కూడా అంతా తానై వ్యవహరిస్తారు. ఆ వైనం ఈ ప్రోమో కటింగ్ లో కూడా కనిపించింది. 22న జరిగే ఓ స్పెషల్ మీట్ లో ఈ కారును ఆవిష్కరిస్తారు.