కుల పిచ్చతో కొట్టుకుంటున్న తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే అనుకుంటుంది. తన కుమార్తెలు ఇద్దరూ లండన్ లో వున్నారు. పోలింగ్ కు కౌంటింగ్ కు కాస్త ఎక్కువ గ్యాప్ వచ్చింది. అందువల్ల వెళ్లి వాళ్లను చూసి, రిలాక్స్ అయి వద్దామన్నది జగన్ ప్లాన్. అదిగో దేశం విడిచి పారిపోతున్నాడు. ఇక రాడేమో? ఇలా రకరకాల వెటకారాలు, ట్రోల్స్. విమానం ఏ రూట్లో వెళ్తోందో, మధ్యలో ఎక్కడ ఆగిందో ట్రాకింగ్ అంటూ తప్పుడు ప్రచారం.
కానీ లొకేష్ ఫ్యామిలీతో ఇప్పటికే అమెరికాకు చేరిపోయారన్నది మాత్రం పైకి చెప్పరు. ఇప్పుడు చంద్రబాబు అండ్ ఫ్యామిలీ అమెరికా వెళ్తున్నారు అంటే మాత్రం సైలంట్. పైగా హెల్త్ చెకప్ కు వెళ్తున్నారు అంటారు. అదే మరెవళ్లైనా హెల్త్ చెకప్ కు అమెరికా వెళ్తే, అదిగో ఆంధ్ర అధ్వాన్నం అయిపోయింది అందుకే అమెరికా వెళ్తున్నారు అంటూ మళ్లీ అదో తరహా ట్రోలింగ్.
బేసిక్ గా వీళ్లకు చంద్రబాబు, అండ్ కో ఏం చేసినా కమ్మగానే వుంటుంది. జగన్ ఏం చేసినా తప్పుగానే వుంటుంది. జగన్ విదేశీ పర్యటన మీద డిస్కషన్లు పెట్టారు. మరి ఇప్పుడు బాబు విదేశీ పర్యటన, హెల్త్ చెకప్ మీద కూడా పెట్టవచ్చు కదా.
బాబు గారి ఆరోగ్యానికి ఏమయింది. తరచు అమెరికాలో ఎందుకు చెకప్ చేయించుకుంటున్నారు.ఇలా ప్యానెల్ డాక్టర్లను కూర్చో పెట్టి రచ్చ చేయచ్చు కదా? అమెరికాలో బాబు గారు ఏ ఆసుపత్రికి వెళ్తారు.. ట్రాక్ చేసి స్క్రిన్ షాట్లు పెట్టచ్చు కదా.
అబ్బే..’మన’ వాడు కాదా బాబు.’మనం’ ఎందుకు చేస్తాం?