Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

గంటా మీద ఘాటు విమర్శలు

గంటా మీద ఘాటు విమర్శలు

మాజీ మంత్రి టీడీపీ అధినేత గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచి పోటీ చేస్తున్నారు. తన గెలుపు ఖాయం అని ఇంక మెజారిటీయే చూసుకోవాలని ఆయనతో పాటు అనుచరులు బల్ల గుద్దుతున్నారు. గంటా అయితే వైసీపీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఊసెత్తడంలేదు. ఆయన జగన్ తోనే పోటీ అన్నట్లుగా ముఖ్యమంత్రి మీదనే విమర్శలు చేస్తున్నారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేసినట్లే అన్నది గంటా వర్గం ధీమాగా ఉంది. గంటా మరో దఫా మంత్రి అవుతారు అని వారు అంటున్నారు. ఎన్నికలు అన్నవి లాంచనం మాత్రమే అని కూడా ఫీల్ అవుతున్నారు.

అయితే 2014 మాదిరిగా 2024 ఉంటుందా అంటే అది భీమిలీ జనాలే డిసైడ్ చేయాలి. టీడీపీలో ఉంటూ టికెట్ దక్కలేదని బయటకు వచ్చేసిన సీనియర్ నేత, మాజీ తమ్ముడు పాశర్ల ప్రసాద్ అయితే గంటా భీమిలీలో ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని ఘాటు కామెంట్స్ చేశారు.

గంటాను 2014లో జనాలు ఎన్నుకున్నారని కానీ ఆయన ఏమి మేలు చేశారో చెప్పాలని పాశర్ల నిలదీశారు. ఆయన సింహాచలం భూముల విషయం కానీ పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కానీ కృషి చేయడంలో విఫలం అయ్యారని మండిపడ్డారు. ఆయన చుట్టూ ఈ సమస్య విషయంలో పదే పదే తిరిగినా అసలు పట్టించుకోలేదని కూడా ఫైర్ అయ్యారు.

దేవస్థానం భూములను ఆక్రమించుకున్న బినామీలకు ఆ భూములను కట్టబెట్టడానికే గంటా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని మరోసారి ఎమ్మెల్యేగా ఆయన నెగ్గితే ప్రజల కంటే బినామీలకే ప్రయోజనం అని పాశర్ల కుండబద్ధలు కొట్టేశారు. ఆ మీదట మీ ఇష్టం అని భీమిలీ ఓటర్లకు ఆయన ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేశారు. భీమిలీ ఓటర్లకు గంటా అనుభవాలు చాలా ఉన్నాయని అంటున్నారు నాయకులను తన పార్టీలోకి లాగేసుకుంటున్న గంటా భీమిలీ ఓటర్లను తిప్పుకుని గెలుస్తారా అని వైసీపీ నేతలు సైతం సవాల్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?