Advertisement

Advertisement


Home > Politics - National

మూడో దశ పోల్.. ఎన్నో చిత్రాలు, మరెన్నో విశేషాలు

మూడో దశ పోల్.. ఎన్నో చిత్రాలు, మరెన్నో విశేషాలు

మూడో దశ పోలింగ్ ముగిసింది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 లోక్ సభ సెగ్మెంట్స్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎప్పట్లానే అస్సాంలో అత్యధిక పోలింగ్ నమోదు కాగా.. మహారాష్ట్రలో అత్యల్పంగా పోలింగ్ జరిగింది. మూడో దశ ఎన్నికల్లో మరికొన్ని చిత్రాలు చోటు చేసుకున్నాయి.

చేతితో కాదు.. కాలితో ఓటు..

గుజరాత్ లోని నడియాడ్ లోని ఓ పోలింగ్ బూత్ లో అంకిత్ సోని ఓటేశాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, అతడు కాలితో ఓటేశాడు. 20 ఏళ్ల కిందట జరిగిన ప్రమాదంలో తన 2 చేతులు కోల్పోయాడు అంకిత్. అయినప్పటికీ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చాడు. కాలి బొటన వేలితో మీట నొక్కి ఓటు వేశాడు.

ఒక్కడి కోసం పోలింగ్ కేంద్రం..

ఓటు వినియోగించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒక్క ఓటరు ఉన్నప్పటికీ అతడి కోసం పోలింగ్ ఏర్పాట్లు చేయాల్సిందే. రెండో విడత పోలింగ్ లో ఓ గిరిజన గ్రామంలో పోలింగ్ కోసం ఎన్నికల సిబ్బంది కొండలుగుట్టలు దాటి వెళ్లి ఓట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. అలాంటిదే మూడో దశ ఎన్నికల్లో కూడా జరిగింది. గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్ పోలింగ్ స్టేషన్ లో ఒకే ఒక్క వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. కేవలం అతడి కోసమే పోలింగ్ స్టేషన్ ఏర్పాటుచేశారక్కడ. అడవిలోని శివాలయంలో ఇతడు పూజారి. 2007 నుంచి ఈ ఒక్కడి కోసమే అక్కడ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు.

ఓటేసిన ప్రధాని..

ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గాంధీనగర్ నుంచి బరిలో ఉన్న అమిత్ షా, మోదీ పక్కనే ఉన్నారు. ఈ విడత పోలింగ్ లో రితేష్ దేశ్ ముఖ్, జెనిలియా లాంటి సెలబ్రిటీల సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కవిత, కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకుంటారా..

ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ.. జైళ్లో ఉన్న కవిత, కేజ్రీవాల్ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారా అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే జైళ్లో ఉన్న వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకోలేరు. రాజ్యాంగం ప్రకారం జైళ్లో ఉన్న వ్యక్తులకు ఓటు వేసే హక్కు లేదు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, విచారణను ఎదుర్కొంటున్న నిందితులతో పాటు... పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనర్హులు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?