పండగ సినిమాల భవిష్యత్?

అంతా సర్దుకుంది. పండుగ సినిమాల ప్లానింగ్ ఫిక్స్ అయింది అనుకంటే మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. జ‌నవరి తొలివారంలో ఆర్ఆర్ఆర్, మలివారంలో రాధేశ్యామ్ విడుదల కావాల్సి వుంది. ఈ రెండు సినిమాలు ప్యాన్…

అంతా సర్దుకుంది. పండుగ సినిమాల ప్లానింగ్ ఫిక్స్ అయింది అనుకంటే మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. జ‌నవరి తొలివారంలో ఆర్ఆర్ఆర్, మలివారంలో రాధేశ్యామ్ విడుదల కావాల్సి వుంది. ఈ రెండు సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే. 

దేశవ్యాప్తంగా విడుదల ప్లాన్ చేసిన సినిమాలు ఇవి. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో విడుదల గట్టిగా ప్లాన్ చేసారు. ప్రచారం చేసారు.

ఇప్పుడు కరోనా మూడో దశ స్టార్ట్ అయింది. మహరాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించారు. తొమ్మిది గంటలకే అన్నీ సర్దేయాలి. అంటే నైట్ షో లు రెండూ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే యాభైశాతం ఆక్యుపెన్సీ. ఢిల్లీ, గుజ‌రాత్ ఇలా ఒక్కో చోట నిబంధనలు అమలు చేయడం ప్రారంభమైంది. చెన్నయ్ లో కూడా ఒకటి రెండు రోజుల్లో కొత్త రూల్స్ వస్తాయని వినిపిస్తోంది.

తెలంగాణ, ఆంధ్ర వ్యవహారాలు ఇప్పటికి ఓకె. కానీ మరో వారం తరువాత ఎలా వుంటాయో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల డేట్ లు మారతాయా, అలాగే వుంటాయా అన్నది చూడాలి. బంగార్రాజు సినిమాకు సమస్య లేదు.