పుష్ప ఎడిట్ రూమ్ లో 30 కోట్లు?

పెద్ద దర్శకులు సినిమా తీస్తే కాస్త వేస్టేజ్ ఎక్కువే వుంటుంది. కావాల్సిందానికన్నా ఎక్కువ ఫుటేజ్ తీయడం దాదాపు అందరు పెద్ద దర్శకులకు అలవాటే.  Advertisement సినిమా అంతా పూర్తయ్యాక అవసరం మేరకు ఫుటేజ్ తీసుకుని…

పెద్ద దర్శకులు సినిమా తీస్తే కాస్త వేస్టేజ్ ఎక్కువే వుంటుంది. కావాల్సిందానికన్నా ఎక్కువ ఫుటేజ్ తీయడం దాదాపు అందరు పెద్ద దర్శకులకు అలవాటే. 

సినిమా అంతా పూర్తయ్యాక అవసరం మేరకు ఫుటేజ్ తీసుకుని మిగిలినది వదిలేస్తారు. రెండున్నర గంటల సినిమాకు నాలుగు గంటల ఫుటేజ్ తీస్తారు పెద్ద దర్శకులు అని టాక్ వుంది.

పుష్ప సినిమాకు సంబంధించినంత వరకు ఇలా పక్కన పెట్టేసిన ఫుటేజ్ ను నిర్మాణపు లెక్కలతో కనుక అంచనా వేస్తే ఓ ముఫై కోట్లు వుంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఒక్క రీల్ కూడా సెకండ్ పార్ట్ కు పనికి వచ్చేది లేదని తెలుస్తోంది. ఆఖరున చిత్రీకరించిన సమంత ‘ఊ అంటావా..’ పాటకు కూడా కాస్త ఎక్కువ ఫుటేజ్ నే చిత్రీకరించారట.

అది కూడా నగదు కింద లెక్కవేస్తే కోటి రూపాయలకు పైగా ఫుటేజ్ వుండిపోయిందని తెలుస్తోంది. నిజానికి దర్శకుడు సుకుమార్ ఈ పుటేజ్ విషయంలో కాస్త జాగ్రత్త పడి వుంటే నిర్మాతలకు ఓ పాతిక ముఫై కోట్లు వ్యయం తగ్గి వుండేది. నిర్మాతలకు సినిమా విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ అయివుండేది.