దళిత రాజకీయం అంటే ఇదేనా బాబూ..?

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ.. ఆమధ్య దళిత శంఖారావం పేరుతో వీడియో కాన్ఫరెన్స్ లు జరిపి మొసలి కన్నీరు కార్చారు చంద్రబాబు. అదే సమయంలో దళిత ప్రజా ప్రతినిధులపై మాత్రం ఓ వ్యూహం ప్రకారం…

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ.. ఆమధ్య దళిత శంఖారావం పేరుతో వీడియో కాన్ఫరెన్స్ లు జరిపి మొసలి కన్నీరు కార్చారు చంద్రబాబు. అదే సమయంలో దళిత ప్రజా ప్రతినిధులపై మాత్రం ఓ వ్యూహం ప్రకారం చంద్రబాబు టీమ్ దాడులకు ప్లాన్ చేస్తోంది. అమరావతి ఉద్యమం పేరుతో కేవలం దళిత ప్రజా ప్రతినిధుల్నే టార్గెట్ చేసుకుంటున్నారు. 

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కారుని గతంలోనే అమరావతి ఉద్యమ కార్యకర్తలు అడ్డుకుని హంగామా చేశారు, మరో ఎమ్మెల్యే శ్రీదేవిపై కూడా సోషల్ మీడియాలో వ్యతిరేక కామెంట్లు పెడుతున్నారు. కేవలం దళిత ప్రజా ప్రతినిధుల్నే టార్గెట్ చేసుకుని మరీ దళిత రాజకీయం సాగిస్తున్నారు బాబు అండ్ టీమ్. తాజాగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడి యత్నం టీడీపీ వర్గాల దౌర్జన్యానికి పరాకాష్టగా మారింది.

సురేష్ పై ఇనుపరాడ్డుతో దాడి చేసేందుకు ఎంపీ ఇంటి వద్దే టీడీపీ కార్యకర్త ప్రయత్నించడం సంచలనంగా మారింది. ఉద్దండరాయునిపాలెంలోని తన నివాసం నుంచి బైటకు వెళ్లేందుకు నందిగం సురేష్ కారులో బయలుదేరుతున్న సమయంలో టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు ఆయనపై దాడికి ప్రయత్నించారు. ఒక్కసారిగా బైక్ పై దూసుకొచ్చి కారుకి అడ్డంగా నిలిపారు. వెంటనే ఇనుపరాడ్ తో ఎంపీ సురేష్ పై దాడి చేయబోయారు.

అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ.. దాడిని ఆపారు. ఆ తర్వాత వారినుంచి తప్పించుకుని సమీపంలోని అమరావతి జేఏసీ నాయకుడు పులి చిన్న ఇంట్లో దాక్కునేందుకు ప్రయత్నించాడు పూర్ణచంద్రరావు. అయితే సెక్యూరిటీ అతడ్ని వెంటబడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాత్రి పదిన్నర గంటలకు ఈ ఘటన జరిగింది.

గత కొంతకాలంగా అమరావతి ఉద్యమకారుల పేరుతో టీడీపీ కార్యకర్తలు పదే పదే దళిత ప్రజా ప్రతినిధులైన నందిగం సురేష్, ఉండవల్లి శ్రీదేవిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

ఓవైపు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని మాట్లాడే చంద్రబాబుకి, దళిత ప్రజా ప్రతినిధులపై జరుగుతున్న దాడులు కనిపించవా. సాక్షాత్తూ టీడీపీ కార్యకర్తే ఎంపీపై దాడి చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయారు. అసలు ఇప్పుడు బాబు ఏమని సమాధానం చెబుతారు. 

కుట్ర‌లు, కుయుక్తులు? ఇదేనా పాత్రికేయ ధ‌ర్మం