శిష్యుడికి సాయం పడుతున్న గురువు

తప్పుడు శిష్యుడిని పైకి తీసుకురావాలంటే అవసరం అయితే గురువు సాయం పట్టాల్సిందే. దర్శకుడు సుధీర్ వర్మ ఇప్పుడు అదే చేస్తున్నారట. తన శిష్యుడు శ్రీకాంత్ రెడ్డి ఓ సినిమా చేస్తున్నారు. పంజా వైష్ణవ్ తేజ్‌తో…

తప్పుడు శిష్యుడిని పైకి తీసుకురావాలంటే అవసరం అయితే గురువు సాయం పట్టాల్సిందే. దర్శకుడు సుధీర్ వర్మ ఇప్పుడు అదే చేస్తున్నారట. తన శిష్యుడు శ్రీకాంత్ రెడ్డి ఓ సినిమా చేస్తున్నారు. పంజా వైష్ణవ్ తేజ్‌తో ఆదికేశవ సినిమా. ఈ సినిమా ఆది సినిమా టైపు ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. కారణం ప్రొడెక్ట్ అనుకున్నట్లు రాకపోవడమే అన్న గుసగుసలు వున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా కోసం దర్శకుడు సుధీర్ వర్మ్ ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. ఇటు శిష్యుడి దర్శకత్వంలో సినిమా, అటు మిత్రుడు నాగవంశీ నిర్మించే సినిమా కావడంతో, అంతకు మించి ప్రస్తుతం ఖాళీగానే వుండడంతో ఆదికేశవ మీద సుధీర్ వర్మ ఫుల్ బిజీ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.  

ఇప్పటికే విదేశాల్లో చిత్రీకరించిన పాటలకు సుధీర్ వర్మ నేతృత్వం వహించారని బోగట్టా. అలాగే కొన్ని సీన్ల రీ షూట్, ఇతరత్రా వ్యవహారాలను ఆయనే చూస్తున్నారట. ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శ్రీలీల తన కెరీర్ ఆరంభంలో అంగీకరించిన సినిమా ఇది. 

ఈ సినిమా సెట్ మీద వుండగానే ధమాకా లాంటి పెద్ద హిట్ పడడం, ఆ తరువాత శ్రీలీల పెద్ద పెద్ద హీరోలతో నటిస్తూ ఫుల్ బిజీ కావడం చకచకా జరిగిపోయింది. ఇప్పుడు ఈ ఆదికేశవ సినిమాకు శ్రీలీల నే స్టార్ అట్రాక్షన్. ఎందుకంటే హీరో వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ఫామ్ లో లేరు. వరుస ఫ్లాపులతో బాధపడుతున్నారు.