జనసేనాని పవన్‌కల్యాణ్ మాజీ భార్య, ప్రముఖ హీరోయిన్ రేణుదేశాయ్ తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు మెరుస్తూ సినిమాలకే పవన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
రేణు దేశాయ్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సామాజిక, రాజకీయ, సినీ సంగతులపై తనవైన అభిప్రాయాల్ని ఆమె నిర్మొహమాటంగా ప్రకటించడం తెలిసిందే.
పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తన సెకెండ్ ఇన్నింగ్స్ ను ఆమె ప్రారంభించనున్నారు. 'హుషారు' ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే 'ఆద్య' విజయదశమి రోజు ఆరంభం కానుంది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాత రజనీకాంత్.ఎస్ తెలిపారు.
మొత్తానికి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎన్నాళ్లగానో పరితపిస్తున్న రేణుదేశాయ్ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అప్పుడప్పుడు డాక్యుమెంటరీలు తీస్తూ సినిమాలపై తన ఇష్టాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తున్న రేణు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రయాణం విజయవంతం కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.