cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

తెరపైకి 'మనో'

తెరపైకి 'మనో'

గాయకుడిగా ఎస్పీబీ ఎంత ఫేమస్ నో నటుడిగా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. ప్రేమికుడు, పవిత్ర బంధం, మిధునం లాంటి మంచి సినిమాలుచేసారు. ఎస్పీబీ తో ఎంతో సాన్నిహిత్యం వున్న గాయకుడు మనో. ఆయన కూడా ఈ మధ్య జబర్దస్త్ లాంటి గేమ్ షొ లు చేస్తూ వైవిధ్యం చాటుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

మనో, శ్రీముఖి, రాజా రవీందర్, రఘు కుంచె లాంటి వారిని తీసుకుని సీనియర్ డైరక్టర్ శివనాగేశ్వరరావు ఓ సినిమా చేయబోతున్నారు. క్రేజీ అంకుల్స్ దాని టైటిల్. ఈ సినిమాను ఆయన శ్రేయాస్ ఓటిటి ఫ్లాట్ ఫారమ్ కోసం నిర్మించబోతున్నారు.

శ్రేయాస్ ఓటిటి కోసమే కమెడియన్లు శ్రీనివాసరెడ్డి-వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో డైరక్టర్ శ్రీనివాసరెడ్డి (పోవే పోరా) ఓ సినిమాను నిర్మించబోతున్నారు. అలాగే సంపూర్ణేష్ బాబు తో గోల్డ్ మాన్ అనే సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ నిర్మిస్తారు.

శ్రేయాస్ ఓటిటి ఇది కాక గోదావరి కథలు అనే ఎనిమిది ఓటిటి ఎపిసోడ్ లను కూడా నిర్మించబోతోంది. ఈ సినిమాకు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తారు. ఈ సినిమాలు అన్నీ ఈ దసరా రోజున ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి.

ఇంకెన్ని రహస్య జీవోలు, వ్యవహారాలున్నాయో