రాధే..ట్రయిలర్..ఆల్ ఇన్ వన్

రాధేశ్యామ్ డైరక్టర్ మొదటి నుంచీ ఒకటే చెబుతున్నారు. రాధేశ్యామ్ లో ఫైట్లు వుండవు అని. కానీ ఏం వుంటాయో చెప్పడం లేదు.  Advertisement ఇప్పుడు ట్రయిలర్ విడుదల అయిన తరువాత తెలిసింది. ఫైట్లు తప్ప…

రాధేశ్యామ్ డైరక్టర్ మొదటి నుంచీ ఒకటే చెబుతున్నారు. రాధేశ్యామ్ లో ఫైట్లు వుండవు అని. కానీ ఏం వుంటాయో చెప్పడం లేదు. 

ఇప్పుడు ట్రయిలర్ విడుదల అయిన తరువాత తెలిసింది. ఫైట్లు తప్ప అన్నీ వున్నాయని. లవ్, రొమాన్స్, ఫన్, ధ్రిల్స్, కలర్ ఫుల్ సీన్లు, సిజి వర్క్స్, ఇంకా చాలా చాలా వున్నాయి.

రాదేశ్యామ్ ట్రయిలర్ అద్భుతం అని చెప్పడానికి లేదు కానీ, బాగాలేదు అనడానికి చాన్స్ లేదు. ప్రతి సీన్ చెక్కినట్లు వున్నాయి. వింటేజ్ రోమ్ కల్చర్ ట్రయిలర్ లో కొట్టవచ్చినట్లు కనిపించింది. చాలా ఇంటెన్సివ్ లవ్ స్టోరీ ని దర్శకుడు రాధాకృష్ణ డీల్ చేసినట్లు కనిపిస్తోంది.

ట్రయిలర్ లో ఒకటి రెండు రిపీట్ సీన్లు వున్నాయి కానీ, టోటల్ గా ఓ కొత్త దనం అయితే వుంది. కానీ ఆ కొత్త సీన్లకు కాస్త కనెక్టివిటీ వుండేలా ట్రయిలర్ కట్ చేసి వుంటే ఇంకా బాగుండేది. థమన్ రీ రికార్డింగ్ తో ట్రయిలర్ ను గట్టిగా పైకి తీసుకువచ్చారు.