వైఎస్ సునీత కోసం ఇంత రిచ్ లాయ‌రా!

ఒక‌వైపు తెలుగుదేశం అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించిన కేసుల్లో వ‌ర‌స విచార‌ణ‌లు కొన‌సాగుతుండ‌టంతో, వైఎస్ అవినాష్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు పై వైఎస్ సునీత దాఖ‌లు చేసిన పిటిష‌న్…

ఒక‌వైపు తెలుగుదేశం అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించిన కేసుల్లో వ‌ర‌స విచార‌ణ‌లు కొన‌సాగుతుండ‌టంతో, వైఎస్ అవినాష్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు పై వైఎస్ సునీత దాఖ‌లు చేసిన పిటిష‌న్ విచార‌ణ మూడు వారాల పాటు వాయిదా ప‌డింద‌నే వార్త ఆస‌క్తిదాయ‌కంగా ఉంది! మ‌రి చంద్ర‌బాబు కేసుల‌కూ, వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ ర‌ద్దు అంశానికీ సంబంధం ఉండ‌టం విశేషం! 

చంద్ర‌బాబు కేసుల వ‌ల్ల అవినాష్ రెడ్డి బెయిల్ ర‌ద్దు కోరుతూ సునీత దాఖ‌లు చేసిన పిటిష‌న్ మూడు నెల‌ల పాటు వాయిదా ప‌డింది! ఎందుక‌లా అంటే, ఆ కేసు విచార‌ణ‌లో సునీత త‌ర‌ఫు న్యాయ‌వాది అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల విచార‌ణ‌ను వాయిదా కోరింద‌ట ఆమె! ఇంత‌కీ ఎవ‌రా న్యాయ‌వాది, ఎందుకు అందుబాటులో లేడు అంటే, అది మ‌రెవ‌రో కాదు సిద్ధార్థ్ లూథ్రానేన‌ట‌!

చంద్ర‌బాబు త‌ర‌ఫున వ‌ర‌స‌గా పిటిష‌న్లు వేస్తూ, వాదిస్తూ ఉన్న లూథ్రా ఇక్క‌డ బిజీగా ఉండ‌టం వ‌ల్ల అక్క‌డ సునీత త‌న పిటిష‌న్ పై విచార‌ణ‌ను మూడు వారాల వాయిదాను కోరిన‌ట్టుగా ఉంది. దీనికి కోర్టు అంగీక‌రించింది.

మ‌రి చంద్ర‌బాబు త‌ర‌ఫున ఇప్పుడు వాదిస్తున్నాయ‌నే, ఇన్నాళ్లుగా వైఎస్ సునీత దాఖ‌లు చేస్తున్న పిటిష‌న్ల‌తోనూ వాదిస్తున్నాడ‌నే అంశం ఇప్పుడు సామాన్యుల‌కూ బోధ‌ప‌డుతూ ఉంది. మ‌రి చంద్ర‌బాబు త‌ర‌ఫున‌, వైఎస్ సునీత త‌ర‌ఫున ఒకే లాయ‌ర్ వాదిస్తూ ఉండ‌టాన్ని యాధృచ్ఛికం అనాలో, కాక‌తాళీయం అనాలో.. న్యాయ‌దేవ‌త‌కే తెలియాలి. 

అయినా రోజుకు కోటో, కోటిన్న‌రో తీసుకుంటార‌ట సిద్ధార్థ్ లూథ్రా! మ‌రి అంత బ‌డా లాయ‌ర్ ను అన్ని పిటిష‌న్ల‌లో ఇంప్లీడ్ అవుతున్న వైఎస్ సునీత ఆర్థికంగా భ‌రిస్తున్నారంటే మాట‌లేమీ కాక‌పోవ‌చ్చు! ఇది కిందిస్థాయి వాళ్ల‌కు అర్థం అయ్యే విష‌యం కాదు, మినిమం డిగ్రీ, లా చ‌దివుండాలేమో!