టాలీవుడ్ కు దూరమైన స్టార్ హీరోయిన్?

సౌతిండియా లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు ఉంది. కానీ టాలీవుడ్ అంటే మొదట్నుంచి చిన్న చూపు. పైగా ప్రచారానికి రాదు. యూనిట్ కు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. ఇలా నయనతారపై చాలా ఊహాగానాలు/కథనాలు…

సౌతిండియా లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు ఉంది. కానీ టాలీవుడ్ అంటే మొదట్నుంచి చిన్న చూపు. పైగా ప్రచారానికి రాదు. యూనిట్ కు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. ఇలా నయనతారపై చాలా ఊహాగానాలు/కథనాలు ఉన్నాయి. కానీ నయనతార కోసం టాలీవుడ్ మేకర్స్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు.

మరీ ముఖ్యంగా సీనియర్ హీరోల సరసన నయన్ ను తీసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసిన నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే ఇకపై టాలీవుడ్ మేకర్స్, నయనతార కోసం ట్రై చేయనక్కర్లేదు. ఆమె టాలీవుడ్ కు దాదాపు దూరం జరిగినట్టే.

కెరీర్ లో ఎక్కువగా కోలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చింది నయనతార. తమిళ సినిమాలకు కాల్షీట్లు కేటాయించగా, ఏమైనా మిగిలితే తెలుగు సినిమాలకు కేటాయించేది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ లో సక్సెస్ వచ్చింది. షారూక్ సరసన నయన్ నటించిన జవాన్ సినిమా పెద్ద హిట్టయింది.

దీంతో హిందీ చిత్రసీమ నుంచి నయనతారకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. హృతిక్ రోషన్ లాంటి హీరోల సినిమాల్లో నటించమని అడుగుతున్నారు. సో.. కోలీవుడ్ సినిమాలకు టైమ్ కేటాయించగా, ఇంకా ఏమైనా డేట్స్ మిగిలితే ఆమె బాలీవుడ్ ప్రాజెక్టులకు కేటాయిస్తుంది. అంతేతప్ప, టాలీవుడ్ సినిమాల వైపు చూడకపోవచ్చు.

తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం గాడ్ ఫాదర్. ఆ తర్వాత నాగ్ లాంటి హీరోలు నయన్ కోసం ట్రై చేసినట్టు వార్తలొచ్చాయి. ఇకపై అలాంటి ఊహాగానాలకు కూడా అవకాశం ఉండకపోవచ్చు.