3 కొత్త సినిమాల్లో 2 ఫ్లాప్.. ఒకటి హిట్

థియేటర్లలో సినిమాలు ఎలాగైతే రిలీజై, హిట్-ఫ్లాప్ అవుతుంటాయో.. బుల్లితెరపై కూడా కొత్త సినిమాలు ఇలానే ప్రసారమై హిట్-ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయి. అలా ఈ వారం 3 కొత్త సినిమాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. వీటిలో ఒకటి…

థియేటర్లలో సినిమాలు ఎలాగైతే రిలీజై, హిట్-ఫ్లాప్ అవుతుంటాయో.. బుల్లితెరపై కూడా కొత్త సినిమాలు ఇలానే ప్రసారమై హిట్-ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయి. అలా ఈ వారం 3 కొత్త సినిమాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. వీటిలో ఒకటి హిట్టవ్వగా.. 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బుల్లితెరపై కూడా హిట్టయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ఈ సినిమాకు 16 టీఆర్పీ రావడం విశేషం. నాగచైతన్య కెరీర్ లో హయ్యస్ట్ టీఆర్పీ సాధించిన సినిమా ఇదే.

ఇక ఇదే వారం శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా కూడా తొలిసారి టీవీల్లో ప్రసారమైంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. జీ తెలుగులో ప్రసారం చేసిన ఈ సినిమాకు కేవలం 3.5 రేటింగ్ మాత్రమే వచ్చింది.

ఇక జెమినీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా లాభమ్ సినిమాను ప్రసారం చేశారు. ఈ సినిమాకు మరీ తక్కువగా 2.9 రేటింగ్ వచ్చింది. ఇలా ఈ వారం బుల్లితెరపైకొచ్చిన కొత్త సినిమాల్లో లవ్ స్టోరీ ఒక్కటే క్లిక్ అవ్వగా.. మిగతా 2 సినిమాలు ఫ్లాప్ అనిపించుకున్నాయి.