నిర్మాత‌ను బీర్ బాటిల్ తో కొట్టిన హీరోయిన్?

క‌న్న‌డ‌, తెలుగు న‌టి సంజనా గల్రానీ ఒక వివాదంలో చిక్కుకుంది. ఒక సినీ నిర్మాత‌పై ఈమె బీర్ బాటిల్ తో దాడికి పాల్ప‌డిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. స‌ద‌రు మ‌హిళా సినీ నిర్మాత ఈ మేర‌కు…

క‌న్న‌డ‌, తెలుగు న‌టి సంజనా గల్రానీ ఒక వివాదంలో చిక్కుకుంది. ఒక సినీ నిర్మాత‌పై ఈమె బీర్ బాటిల్ తో దాడికి పాల్ప‌డిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. స‌ద‌రు మ‌హిళా సినీ నిర్మాత ఈ మేర‌కు సంజ‌నా పై పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేసింది. డిసెంబ‌ర్ ఇర‌వై నాలుగో తేదీన ఒక పార్టీలో ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్టుగా వంద‌న అనే ఆ సినీ నిర్మాత పేర్కొంది.

తామిద్ద‌రం ఒక విష‌యంలో గొడ‌వ ప‌డిన‌ట్టుగా వందన పేర్కొంది. వాదోప‌వాదాలు జ‌రిగాయ‌ని, ఆ స‌మ‌యంలో సంజ‌న త‌న‌పై భౌతిక దాడికి పాల్ప‌డింద‌ని, బీర్ బాటిల్ తో త‌నను కొట్టింద‌ని వంద‌న ఆరోపిస్తోంది. ఈ మేర‌కు ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

త‌ను వంద‌న‌తో గొడ‌వ ప‌డిన మాట అయితే వాస్త‌వ‌మే అని సంజ‌న ప్ర‌క‌టించింది. త‌మ మ‌ధ్య పార్టీలో గొడ‌వ అయితే సాగింద‌ని, కానీ త‌ను వంద‌న‌ను కొట్ట‌లేద‌ని.. బీర్ బాటిల్ తో దాడికి పాల్ప‌డిన‌ట్టుగా ఆమె చెబుతున్న‌ది అబ‌ద్ధ‌మ‌ని సంజ‌న త‌న వాద‌న వినిపిస్తోంది. ఈ మేర‌కు ఈమె ట్వీట్ చేసింది.

గొడ‌వ జ‌రిగింద‌ని ఇద్ద‌రూ చెబుతున్నారు. త‌న‌పై సంజ‌న బీర్ బాటిల్ తో దాడి చేసింద‌ని వంద‌న చెబుతోంది, ఆ హీరోయిన్ మాత్రం అలాంటిది ఏమీ లేద‌ని అంటోంది. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రుపుతామ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు.

తెలుగు సినిమా బిగ్ స్టోరీ