ప్రతియేటా ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసే సంపాదన పరుల జాబితాను ఈ ఏడాదికి ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు వివిధ స్థానాలను ఇస్తూ ఆ పత్రిక జాబితాను విడుదల చేసింది. దానిపై సదరు సెలబ్రిటీలు ఎవరూ పెద్దగా స్పందించలేదు.
అయితే ఈ జాబితా గురించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగీల ఇది వరకూ ఘాటుగా స్పందించింది. ఫోర్బ్స్ జాబితాలో పేర్కొన్నవన్నీ అబద్ధాలు అని ఆమె అభిప్రాయపడింది. అసలు విషయాలు ఎవరికీ తెలియవని వివరించింది. అయితే అంతటితో ఆగలేదు ఈ రంగీల. వివాదాలు అంటే ఈమెకు మోజు ఎక్కువ. అందుకే ఫోర్బ్స్ పత్రికకు కూడా లీగల్ నోటీసులు పంపించిందట.
తన సోదరి కంగనా రనౌత్ సంపాదన తగ్గిందని అంటూ, ఆమె ర్యాంకును ఎక్కువగా చూపుతూ.. ఫోర్బ్స్ ప్రచురించిందని, అందుకు గానూ ఆ పత్రికకు లీగల్ నోటీసులు పంపినట్టుగా, అయితే వారు స్పందించడం లేదని రంగీలా అంటోంది.
తన సోదరి సంపాదన 17.5 కోట్ల రూపాయలు అంటూ ఫోర్బ్స్ పేర్కొందని.. కానీ ఆమె సంపాదన చాలా ఎక్కువని రంగీల అంటోంది. ఫోర్బ్స్ పేర్కొన్న మొత్తం స్థాయిలో తన సోదరి ఇన్ కమ్ ట్యాక్సే కట్టిందని రంగీల అంటోంది!