బిగ్ బి.. రిటైర్మెంట్..?

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌ట‌న నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారా? ద‌శాబ్దాలుగా స్టార్ హీరోగా, న‌టుడిగా అల‌రిస్తూ వ‌స్తున్న అమితాబ్ ఇక చిత్ర ప‌రిశ్ర‌మ‌లో న‌టన నుంచి వైదొల‌గ‌నున్నారా? ఈ సందేహాల‌ను ఆయ‌న…

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌ట‌న నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారా? ద‌శాబ్దాలుగా స్టార్ హీరోగా, న‌టుడిగా అల‌రిస్తూ వ‌స్తున్న అమితాబ్ ఇక చిత్ర ప‌రిశ్ర‌మ‌లో న‌టన నుంచి వైదొల‌గ‌నున్నారా? ఈ సందేహాల‌ను ఆయ‌న మాట‌లే రేకెత్తిస్తూ ఉన్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీక‌రించిన అనంత‌రం అమితాబ్.. రిటైర్మెంట్ ఆలోచ‌న పంచుకున్నారు. ఆ అవార్డును స్వీక‌రించ‌డంతో, ఇక చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి త‌ప్పుకోవ‌డానికి స‌మ‌యం ఆసన్న‌మైంద‌నే భావ‌న త‌న‌లో క‌లిగించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే కొంత అన్ ఫినిష్డ్ వ‌ర్క్ ఉంద‌ని, అది పూర్తి చేయాల్సి ఉంద‌ని బిగ్ బి పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం అమితాబ్ వ‌య‌సు 77 సంవ‌త్స‌రాలు. అయితే ఇటీవ‌లి కాలంలో కూడా ఆయ‌న కొన్ని సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు. పింక్, బ‌ద్లా వంటి సినిమాల్లో అమితాబ్ న‌ట‌న వాటిని సూప‌ర్ హిట్ చేసింది. ఇలా త‌న వ‌య‌సుకు త‌గ్గ‌ట్టైన పాత్ర‌ల్లో కూడా త‌న న‌ట‌నా ప‌టిమ‌ను చూపిస్తూ అమితాబ్ దూసుకెళ్తూ ఉన్నారు. ఇప్ప‌టికీ అమితాబ్ ను త‌మ సినిమాల్లో న‌టింప‌జేసుకోవ‌డానికి చాలా మంది మూవీ మేక‌ర్లు ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉన్నారు.

ద‌క్షిణాదిన 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో న‌టించారు బిగ్ బి. ఆయ‌న ఓకే చెబితే మ‌రింత మంది మూవీ మేక‌ర్లు రెడీగా ఉన్నారు కూడా. అయితే అమితాబ్ వ‌య‌సు స‌హ‌క‌రిస్తున్న‌ట్టుగా లేదు. దీంతో వీలైన‌న్ని త‌క్కువ సినిమాలకు మాత్ర‌మే ఆయ‌న ఓకే చెబుతున్న‌ట్టుగా ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా మ‌న్న‌న‌లు అందుకున్న ఈ వెండి తెర వేల్పు రిటైర్మెంట్ ఆలోచ‌న‌ను పంచుకోవ‌డం గ‌మ‌నార్హం.

తెలుగు సినిమా బిగ్ స్టోరీ